న్యూఢిల్లీ: హెల్త్‌కేర్ చైన్ అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ నికరలాభం 2022 ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 35 శాతం క్షీణించింది. నిరుడు ఇదేకాలంలో నమోదైన రూ. 500.68 కోట్ల లా భం తాజా త్రైమాసికంలో రూ. 324 కోట్లకు పరిమితమయ్యింది.
ఆదాయం స్వల్పంగా పెరగడం, ఖర్చులు అధికంకావడంతో లాభాలు తగ్గా యి. కన్సాలిడేటెడ్ ఆదాయం రూ. 3,760 కోట్ల నుంచి రూ. 3,795 కోట్లకు పెరిగింది. ఖర్చులు రూ. 3,475 కోట్ల నుంచి రూ. 3,545 కోట్లకు పెరిగాయి. మెటీరియల్స్ వ్యయాలు రూ. 582 కోట్ల నుంచి రూ.612 కోట్లకు చేరినట్టు అపోలో తెలిపింది.