చెన్నై, డిసెంబర్ 24: ప్రముఖ హెల్త్‌కేర్ సంస్థ అపోలో హాస్పిటల్స్..తన వ్యాపారాలను విడగొట్టింది. ఫార్మసీ, డిజిటల్ హెల్త్ వ్యాపారాలను విడగొట్టి ప్రత్యేక సంస్థలుగా నెలకొల్పింది. ఈ నిర్ణయానికి ఎన్ఎస్ఈ ఆమోదం తెలిపింది.
దీంతో వచ్చే 18 నుంచి 21 నెలల్లో ఈ రెండు సంస్థలను మార్కెట్లోకి లిస్ట్ చేసేయోచనలో ఉన్నది. ఈ నిర్ణయానికి కాంపిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా గతంలోనే గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రతిపాదనపై షేరు హోల్డర్లు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సంస్థ బీఎస్ఈకి సమాచారం అందించింది. అపోలో 24/7 పేరుతో ప్రత్యేకంగా హెల్త్‌కేర్ సేవలు అందిస్తున్నది.