న్యూఢిల్లీ, నవంబర్ 6 : అపోలో హాస్పిటల్స్ ప్రోత్సాహకర ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.477 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది.
క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.379 కోట్లతో పోలిస్తే 26 శాతం వృద్ధిని నమోదు చేసుకున్నది. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం రూ.5,589 కోట్ల నుంచి రూ.6,304 కోట్లకు ఎగబాకింది.