హైదరాబాద్, మే 14: హెల్త్‌కేర్ సేవల సంస్థ అపోలో హాస్పిటల్స్ గ్రూపు మళ్లీ బీమా రంగంలోకి అడుగుపెట్టింది. తన అనుబంధ సంస్థయైన అపోలో హెల్త్‌కో ఈ నూతన సేవలకు శ్రీకారం చుట్టింది.
ఇందుకోసం ఎనిమిది బీమా సంస్థలతో జట్టుకట్టింది. ఈ సందర్భంగా అపోలో హెల్త్‌కో సీఈవో మాధివనన్ బాలకృష్ణన్ మాట్లాడుతూ.. పైలెట్ ప్రాజెక్టు విజయవంతంగా పూర్తికావడంతో వచ్చే రెండు నెలల్లో పూర్తిస్థాయిలో సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.