బెంగళూరు, ఫిబ్రవరి 16: దేశీయ స్టాక్ మార్కెట్లలో ఐటీ రంగ షేర్లను గతకొద్ది రోజులుగా కుదిపేస్తున్న ఆంథ్రోపిక్.. బెంగళూరులో నూతన కార్యాలయాన్ని తెరిచింది. అమెరికాకు చెందిన ఈ కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారిత కంపెనీ దెబ్బకు ఐటీ కంపెనీలకు పని కరువవుతుందని, లాభాలు పడిపోతాయన్న భయాలు మదుపరులలో నెలకొన్నాయి మరి.
కాగా, దేశీయ మార్కెట్లో విస్తరించేందుకు కంపెనీ ఈ సందర్భంగా వివిధ భాగస్వామ్యాలను ప్రకటించింది. భారత్‌ను తమ క్లౌడ్.ఏఐకి రెండో అతిపెద్ద మార్కెట్‌గా పేర్కొన్నది.