మహీంద్రా అధిపతిగా అనిశ్ షా

న్యూఢిల్లీ, మార్చి 26: దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా
(ఎంఅండ్ఎం) మేనేజింగ్ డైరెక్టర్, సీఈవోగా అనిశ్ షా నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన కంపెనీ డిప్యూటీ ఎండీ, గ్రూపు చీఫ్ ఫైనాన్షియల్ అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. వచ్చే నెల 2న పదవీ విరమణ చేయనున్న పవన్ గోయెంకా స్థానాన్ని షా భర్తీచేయనున్నారు. రెండేండ్ల క్రితం టాప్ మేనేజ్మెంట్లో కీలక మార్పులు చేసిన మహీంద్రా.. మరోసారి ఇలాంటి మార్పులకు శ్రీకా రం చుట్టింది. ఈ సందర్భం గా మహీంద్రా గ్రూపు చైర్మన్ ఆనంద్ మహీంద్రా మాట్లాడుతూ.. దేశీయ, అంతర్జాతీయ వ్యాపారాలను సమతుల్యం చేసేందుకు అనిశ్ షా సరైన వ్యక్తని, అతని నాయకత్వంలో గ్రూపు మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించే అవకాశాలున్నాయన్నారు. 2015లో గ్రూపు ప్రెసిడెంట్‌గా చేరిన షా.. అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రస్తుతం ఎండీ, సీఈవోగా పదొన్నతి పొందారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

