న్యూఢిల్లీ, అక్టోబర్ 13 : ప్రపంచ చరిత్రలో అతిపెద్ద మార్కెట్ క్రాష్ ఈ ఏడాది సంభవించబోతున్నదని ప్రముఖ రచయిత రాబర్ట్ కియోసాకి హెచ్చరించారు. రికార్డు స్థాయిలో దూసుకుపోతున్న అతి విలువైన లోహాల్లో ప్రస్తుతం పెట్టుబడులు పెట్టడం శ్రేయస్కరం కాదని, ఇవి ఎప్పుడైనా కూలిపోయే ప్రమాదం ఉన్నదని రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత ఆయన ఎక్స్‌లో హెచ్చరించారు. ఈ ఏడాది అతి విలువైన లోహాలపై పెట్టుబడులు పెట్టడం మంచి పరిణామం కాదన్నారు. కాగితం ఆధారిత పెట్టుబడుల నుంచి స్పష్టమైన ఆస్తులకు మారాలనే తన నిరంతర సలహా అని సూచించారు. ముఖ్యంగా వెండి, ఎథెరియంను ఆచారణాత్మక పారిశ్రామిక అనువర్తనాలేనని, వీటిని తక్కువ విలువ కలిగిన వస్తువులు మాత్రంగా గుర్తించనని పేర్కొన్నారు.
ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా పొదుపు చేసేవారికి నిరాశ తప్పదని తన అభిప్రాయాన్ని నొక్కి చెప్పారు. బంగారం, వెండి, బిట్‌కాయిన్, ఎథెరియం వంటి భౌతిక, వర్చ్యూవల్ ఆస్తులలో పెట్టుబడులు పెట్టాలని ఆయన ప్రజలకు సూచించారు. నిజమైన ఆస్తుల్లో మాత్రమే పెట్టుబడులు పెట్టాలని, వీటిలో రియల్ ఎస్టేట్ కీలకమని, భవిష్యత్తులో భూమి బంగారంగా మారుతున్నదనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తంచేశారు. అలాగే వెండి, ఎథెరియంలు సంపద సంరక్షణ సాధనాలుగా మాత్రమే కాకుండా పరిశ్రమలో కూడా ఉపయోగించబడుతాయని చెప్పారు.