Pawan Kalyan | ప్రస్తుతం ప్రతి ఒక్కరూ క్రెడిట్ కార్డులు వాడుతున్నారు. ఇప్పుడు ప్రతి విషయంలో డిజిటల్ చెల్లింపులు ఎక్కువయ్యాయి. ఆన్ లైన్ కొనుగోళ్లు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో ఈ-కామర్స్ సంస్థలు గిఫ్ట్ కార్డులు జారీ చేస్తుంటాయి. ఆయా గిఫ్ట్ కార్డులు కొనుగోలు చేసిన కస్టమర్లకు వాటి ఎక్స్పైరీ డేట్ అయిపోయినా వాటిల్లో ఉన్న మనీ రీఫండ్ చేయడం లేదు. ఈ విషయమై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కస్టమర్లకు సరళతరమైన సేవలందించేందుకు పారదర్శకత పాటిస్తూ న్యాయంగా వ్యవహరించడమే ప్రాధాన్యాలు కావాలని ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్‌కు సూచించారు.
‘సాధారణంగా అమెజాన్ గిఫ్ట్ కార్డ్‌లో మనీ డిపాజిట్ చేయడం నేరుగా చేసేయొచ్చు. అలాగే ఆ గిఫ్ట్ కార్డు టైం ఎక్స్పైరీ అయిపోయాక అలాగే మనీ రీఫండ్ కావడం లేదు. మామూలుగానైతే ఆన్లైన్లో కార్డ్ నంబర్ నమోదు చేస్తే లావాదేవీలు పూర్తవుతాయి. కానీ అలా జరక్కపోగా తప్పనిసరి పరిస్థితుల్లో కస్టమర్ సర్వీస్‌ను సంప్రదించి.. ప్రక్రియ పూర్తి చేయడానికి చాలా సమయం తీసుకోవాల్సి వస్తోంది’అని ఎక్స్ ఖాతాలో పవన్ కల్యాణ్ పోస్ట్ చేశారు. ఈ పోస్టుకు ఈ-కామర్స్ జెయింట్ అమెజాన్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్బీఐని ట్యాగ్ చేశారు.
While putting money into the Amazon gift card, the process is seamless and straightforward. Simply enter your card or UPI information, and the transaction is complete.
However, this is not the same while recovering balance from an expired gift card. Users must contact customer…— Pawan Kalyan (@PawanKalyan) January 27, 2025
ఈ-కామర్స్ గిప్ట్ కార్డులు తీసుకున్న యూజర్ల ఖాతాల్లోకి వారు వినియోగించని సొమ్ము ఆటోమేటిక్‌గా రీఫండ్ కావడానికి సింపుల్ పరిష్కారం ఎందుకు లేదని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. ఆటోమేటిక్‌గా యూజర్ల బ్యాంకు ఖాతాల్లో సదరు గిఫ్ట్ కార్డుల్లో మిగిలిపోయిన సొమ్ము జమ అయితే వారి టైం కలిసి వస్తుందని, వారు జమ చేసిన సొమ్ము పోగొట్టుకోకుండా వీలవుతుందని గుర్తు చేశారు. ఈ – కామర్స్ సంస్థలు పారదర్శకత, సమానత్వం, సరళీకృత విధానాలను ప్రోత్సహించాలని సూచించారు. లక్షల మంది యూజర్ల విశ్వాసాన్ని చూరగొనేందుకు యూజర్ ప్రెండ్లీ సొల్యూషన్ కనుగొనాలని నొక్కి చెప్పారు.