ముంబై : ఈ వీకెండ్లో బాలీవుడ్ భామ నోరా ఫతేహి రెడ్ డ్రెస్‌లో ముంబై జనాల మతి పోగొట్టింది. మోకాళ్లపైకి ఉన్న ఈ రెడ్ డ్రెస్‌తో పాటు రూ ౩ లక్షల ఖరీదైన బ్యాగ్‌తో స్టన్నింగ్ లుక్‌లో నోరా ముంబై వీధుల్లో కెమెరాల కంటికి చిక్కారు.
నలుపు రంగు మాస్క్, షూస్‌తో సింపుల్ జ్యూవెలరీతో ఆమె ఆకట్టుకున్నారు. ఇక నోరా చేతిలోని లూయిస్ వుటన్ బ్రాండ్ బ్యాగ్ ధర ఏకంగా రూ 3,15,239పైమాటే.