Amul | అరుదైన మైలురాయి చేరుకున్న అమూల్.. ఏడాదిలో లక్ష కోట్ల వ్యాపారం
Amul : దేశంలో డైరీ ఉత్పత్తుల్లో అగ్ర సంస్థగా ఉన్న అమూల్ అరుదైన ఘనత సాధించింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో లక్ష కోట్ల వ్యాపార సంస్థగా నిలిచింది. ఈ ఏడాది సంస్థ ఏకంగా 11 శాతం వృద్ధి సాధించింది.
Amul : దేశంలో డైరీ ఉత్పత్తుల్లో అగ్ర సంస్థగా ఉన్న అమూల్ అరుదైన ఘనత సాధించింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో లక్ష కోట్ల వ్యాపార సంస్థగా నిలిచింది. ఈ ఏడాది సంస్థ ఏకంగా 11 శాతం వృద్ధి సాధించింది. అమూల్.. గుజరాత్‌కు చెందిన సంస్థ. ద గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ (జీసీఎంఎంఎఫ్) సంస్థ అమూల్ బ్రాండ్‌తో వ్యాపారం నిర్వహిస్తుంటుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో 11 శాతం వృద్ధితో, లక్ష కోట్లకుపైగా వ్యాపారాన్ని నిర్వహించినట్లు సంస్థ తాజాగా ప్రకటించింది.
ఈ సంస్థ ఇంతకుముందు 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.90,000 కోట్ల వ్యాపారం సాధించింది. ఇప్పుడు దీన్ని అధిగమించి, భారీ లాభాలతో లక్ష కోట్లు దాటింది. అమూల్.. దేశంలో టాప్ డైరీ బ్రాండ్‌గా కొనసాగుతోంది. ఈ సంస్థ దాదాపు 1,200 రకాల ఉత్పత్తుల్ని మార్కెటింగ్ చేస్తోంది. ఆధునిక వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు తన మార్కెటింగ్ వ్యూహాల్ని మార్చుకుంటూ వస్తోంది. ఈ ఫెడరేషన్లో 18 జిల్లా కో ఆపరేటివ్ సంస్థలు కూడా సభ్యత్వం కలిగి ఉన్నాయి. భారీ లక్ష్యా్న్ని చేరుకున్న సందర్భంగా జీసీఎంఎంఎఫ్ చైర్మన్ అశోక్‌భాయ్ చౌదరి స్పందించారు. లక్షలాది మంది వినియోగదారులు, నిరంతరం శ్రమించే 36 లక్షల మంది రైతుల నమ్మకం కారణంగా ఈ విజయం సాధ్యమైందన్నారు.
జీసీఎంఎంఎ సంస్థ దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా అతిపెద్ద డైరీ సంస్థ. ఇందులో 36 లక్షల మంది రైతులు సభ్యులుగా ఉన్నారు. పాలు, పాల ఉత్పత్తుల్ని 50కిపైగా దేశాల్లో విక్రయిస్తోంది. స్పెయిన్ సహా యూరప్ దేశాల్లో, అమెరికాలోనూ వ్యాపారం చేస్తోంది. రోజూ 31 మిలియన్ లీటర్ల పాలను సేకరిస్తోంది. సంవత్సరానికి 24 బిలియన్ల ప్యాకెట్లు విక్రయిస్తోంది. వీటిలో పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, ఐస్ క్రీమ్ వంటి పలు పదార్థాలున్నాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఘనంగా రావులపల్లి రాంప్రసాద్ జన్మదిన వేడుకలు
Prabhas | ప్రభాస్ ‘ఫౌజీ’ కొత్త రిలీజ్ డేట్ ఇదేనా..ఇదే నిజమైతే ‘స్పిరిట్’పై ప్రభావం తప్పదా?
‘అర్హులైన పట్టభద్రులందరూ ఓటర్లుగా నమోదు కావాలి’
NTR | ఎన్టీఆర్ అభిమానుల తీరుపై సజ్జనార్ అసంతృప్తి.. నా ఫొటోను మార్ఫింగ్ చేశారు అంటూ ట్వీట్!
Heart Attack | మహిళల్లో పెరుగుతున్న గుండె పోటు ముప్పు.. ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

