NITI Aayog : ప్రతి భారతీయుడూ మెరుగైన జీవన ప్రమాణాలు కలిగిఉండాలని తాను ఆకాంక్షిస్తానని నీతి ఆయోగ్ మాజీ సీఈవో అమితాబ్ కాంత్ అన్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయన బుధవారం ఓ వార్తాసంస్ధకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆర్ధిక వ్యవస్ధకు సంబంధించి పలు వివరాలు ప్రస్తావించారు. మన మానవాభివృద్ధి సూచికలు ఉన్నతంగా ఉన్నాయని, మన సామాజిక సూచికలు మెరుగ్గా ఉన్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు.
దేశంలో ప్రతి పౌరుడు మంచి అభ్యాస ఫలితాలను కలిగి ఉండాలి, మనకు చాలా మంచి ఆరోగ్య ఫలితాలు ఉండాలి, మన పోషకాహార ప్రమాణాలు అధికంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. మన తలసరి ఆదాయాన్ని ప్రస్తుతమున్న 2600 డాలర్ల నుంచి 18000 డాలర్ల స్ధాయికి తీసుకువెళ్లాలని అన్నారు. భారత్ డిజిటలీకరణలో మెరుగైన ఫలితాలు రాబట్టడంతో ప్రతి ఒక్కరికీ గుర్తింపు లభించిందని చెప్పారు.
ప్రతి ఒక్కరూ ఇవాళ మొబైల్లో వేగవంతమైన చెల్లింపులు చేపడుతున్నారని తెలిపారు. సంపద సృష్టికి మనం పధకాలను అందుబాటులోకి తీసుకురాగలుగుతున్నామని అన్నారు. స్టాక్ మార్కెట్, బీమా ప్రీమియం చెల్లింపుల నుంచి మొబైల్లో 30 సెకన్లలో క్రెడిట్ పొందగలుగుతున్నారని వివరించారు. డిజిటల్ చెల్లింపుల్లో మనం విప్లవాత్మక చర్యలు చేపట్టామని తెలిపారు.
Read More :
Arvind Kejriwal | కేజ్రీవాల్‌కు చుక్కెదురు.. మధ్యంతర బెయిల్ ఇవ్వలేమన్న సుప్రీంకోర్టు