హైదరాబాద్, జూన్ 16: అమెరికాకు చెందిన ఐటీ సేవల సంస్థ అన్రెవెల్ డాటా.. హైదరాబాద్ క్యాంపస్‌ను మరింత విస్తరించబోతున్నది. వచ్చే ఏడాది చివరికల్లా నగరంలోని ఆఫీస్‌లో పనిచేస్తున్న సిబ్బంది సంఖ్యను రెట్టింపు చేయనున్నట్లు కంపెనీ కో-ఫౌండర్, సీటీవీ శివ్‌నాథ్ బాబు తెలిపారు.
కొత్తగా ఎంత మందిని నియమించుకునే విషయాన్ని ఆయన వెల్లడించలేదు. నగరం ఆఫీస్ సంస్థకు చాలా కీలకమని, ఇక్కడి నుంచే కస్టమర్లకు ఐటీ సేవలు అందిస్తున్నట్టు చెప్పారు. ప్రస్తుతం సంస్థకు ఫార్చ్యూన్ 500 కంపెనీలైన క్రెడిట్ స్యూస్, ఇంటెల్, అడోబ్, డీబీఎస్ బ్యాంక్, సిటీ, నోవార్టిస్, మాస్టర్‌కార్డ్‌లు క్లయింట్లుగా ఉన్నారు.