ఫెడెక్స్ ఏసీసీ సెంటర్ ఇక్కడే!
అమెరికాకు చెందిన సరుకు రవాణా సేవల సంస్థ ఫెడెక్స్..దేశంలో తన తొలి అడ్వాన్స్ కెపాబిలిటీ కమ్యూనిటీ(ఏసీసీ) సెంటర్‌ను హైదరాబాద్‌లో నెలకొల్పబోతున్నది. ఈ ఏడాది రెండో అర్థభాగంలో అందుబాటులోకి రానున్న ఈ సెంటర్‌తో భారత్‌లో తన విస్తరణ కార్యకలాపాలను మరింత వేగవంతం విస్తరించడానికి దోహదం చేయనున్నదని పేర్కొంది.
హైదరాబాద్, మార్చి 9: అమెరికాకు చెందిన సరుకు రవాణా సేవల సంస్థ ఫెడెక్స్..దేశంలో తన తొలి అడ్వాన్స్ కెపాబిలిటీ కమ్యూనిటీ(ఏసీసీ) సెంటర్‌ను హైదరాబాద్‌లో నెలకొల్పబోతున్నది. ఈ ఏడాది రెండో అర్థభాగంలో అందుబాటులోకి రానున్న ఈ సెంటర్‌తో భారత్‌లో తన విస్తరణ కార్యకలాపాలను మరింత వేగవంతం విస్తరించడానికి దోహదం చేయనున్నదని పేర్కొంది. ముఖ్యంగా వ్యాపార వర్గాలకు మరింత వేగవంతంగా సరుకు రవాణ చేయడానికి అవసరమైన టెక్నాలజీ, ఇన్నోవేషన పరంగా చర్యలకు ఈ సెంటర్ కీలకంకానున్నదని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. వ్యాపార అవసరాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనే ఈ ఏసీసీ సెంటర్లను నెలకొల్పాలని కంపెనీ నిర్ణయించింది.
వినియోగదారుల కోసం ప్రపంచంలోనే అత్యంత సౌకర్యవంతమైన, సమర్థవంతమైన సరఫరా వ్యవస్థను తీర్చిదిద్దుతున్నాం. భారత్‌లో ప్రారంభిస్తున్న తొలి ఏసీసీ చాలా కీలకం. దీంతోసరుకు రవాణా వేగవంతం కావడంతోపాటు మరింత సౌకర్యవంతంగా అందించినట్లు అవుతున్నది.
– రాజ్ సుబ్రమణియమ్, ఫెడెక్స్ ప్రెసిడెంట్, సీఈవో
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- ACC
- advanced technology
- ceo
- FedEx
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

