American chipmaker Qualcomm : అమెరికన్ సెమీకండక్టర్ తయారీదారు క్వాల్‌కాం చెన్నైలో డిజైన్ సెంటర్‌ను ప్రారంభించింది. ఈ డిజైన్ సెంటర్‌ను కంపెనీ ప్రెసిడెంట్, సీఈవో క్రిస్టియానో అమన్ సమక్షంలో కేంద్ర సమాచార, సాంకేతిక శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ గురువారం ప్రారంభించారు.
అమెరికా కేంద్రంగా పనిచేసే మల్టీనేషనల్ కార్పొరేషన్ క్వాల్‌కాం సెమీకండక్టర్ల డిజైనింగ్, మ్యాన్యుఫ్యాక్చరింగ్తో పాటు వైర్లెస్ టెలికమ్యూనికేషన్స్ ఉత్పత్తుల్లో దిగ్గజ కంపెనీగా పేరొందింది. దేశంలో సెమీకండక్టర్ ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేయాలనే ప్రధాని మోదీ సంకల్పంతో ఈరోజు చెన్నైలో క్వాల్‌కాం సెమీ కండక్టర్ డిజైన్ సెంటర్‌ను లాంఛ్ చేశామని మంత్రి పేర్కొన్నారు.
భారత్‌లో సెమీకండక్టర్ ఉత్పత్తిపై మంత్రి అశ్వనీ వైష్ణవ్ మాట్లాడుతూ చెన్నైలో ప్రారంభించిన డిజైన్ సెంటర్లో క్వాల్‌కాం బోర్డులోని మూడు సెమీకండక్టర్ చిప్స్ డిజైన్ అవుతాయని తెలిపారు. కాగా, తారామణిలోని రామానుజన్ ఐటీ సిటీలో 6జీ యూనివర్సిటీ రీసెర్చ్ ఇండియా ప్రోగ్రామ్‌ను మంత్రి అశ్వనీ వైష్ణవ్ ప్రారంభించారు.
Read More :
WPL 2024 | ఢీల్లీని ఢీకొట్టేదెవరు.. ఆర్సీబీ అద్భుతం చేసేనా..?