Amazon Black Friday Sale | ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ అమెజాన్ బ్లాక్ ఫ్రైడే సేల్ ప్రారంభమైంది. శుక్రవారం నుంచి వచ్చేనెల రెండో తేదీ వరకూ ఈ సేల్ కొనసాగుతుంది. అమెరికాలో షాపింగ్ సీజన్ ప్రారంభానికి సూచికగా బ్లాక్ ఫ్రైడే సేల్ నిర్వహిస్తారు. దేశీయంగా నాలుగు రోజుల పాటు సాగే బ్లాక్ ఫ్రైడే సేల్ లో స్మార్ట్ ఫోన్లు, టీవీలు, ఇతర గృహోపకరణాలు, ఫ్యాషన్ ఉత్పత్తులపై అమెజాన్ ఆకర్షణీయ ఆఫర్లు అందిస్తున్నది.
శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఫోన్ ఎంఆర్పీ రూ.1,24,999 కాగా, ఆఫర్ కింద రూ.74,999లకే అందుబాటులోకి వస్తుంది. ఆపిల్, ఐక్యూ, వన్ప్లస్, రియల్మీ, రెడ్మీ, టెక్నో స్మార్ట్ ఫోన్లతోపాటు ఎలక్ట్రానిక్ వస్తువులపై 40 శాతం నుంచి 75 శాతం వరకూ డిస్కౌంట్ ఇస్తున్నట్లు అమెజాన్ వెల్లడించింది. ఎయిర్ కండీషనర్లపై 65 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. ఆపిల్ మ్యాక్ బుక్ ఎయిర్ ఎం1-2020 లాప్ టాప్ ఎంఆర్పీ ధర రూ.89,900 కాగా, ఆఫర్ కింద రూ.59,990లకు లభిస్తుంది. యాక్సిస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, వన్ కార్డు, హెచ్డీఎఫ్సీ బ్యాంకు కార్డులపై పది శాతం డిస్కౌంట్ అందిస్తోంది.