న్యూయార్క్ : రిటైల్ దిగ్గజం అమెజాన్ (Amazon) తన ఆపరేషన్స్‌ను ఆటోమేట్ చేసే క్రమంలో అమెరికాలోని ఓ వేర్‌హౌస్‌లో హ్యుమనాయిడ్ రోబోలను ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టింది. డిజట్ అనే రెండు కాళ్ల రోబో వస్తువులను అవలీలగా గ్రహించి లిఫ్ట్ చేస్తుందని అమెజాన్ వెల్లడించింది. వేర్‌హౌస్‌లో ఖాళీగా ఉన్న బాక్సులను తరలించేందుకు ఈ డివైజ్‌ను వాడుతున్నారు.
కంపెనీలో పనిచేసే 15 లక్షల మంది ఉద్యోగులపై రోబోల ఆగమనంతో ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదని కంపెనీ సిబ్బందికి భరోసా ఇచ్చింది. అయితే రోబోల ఎంట్రీతో కొన్ని ఉద్యోగాల అవసరం లేకున్నా, ఇవి కొత్త ఉద్యోగాలనూ సృష్టిస్తాయని అమెజాన్ రోబోటిక్స్ చీఫ్ టెక్నాలజిస్ట్ టై బ్రాడీ పేర్కొన్నారు. అమెజాన్ వ్యాపారంలో అధ్వాన్నమైన, పునరావృత పనులను తొలగించాలని కంపెనీ కోరుకుంటోందని బ్రాడీ తెలిపారు.
మరోవైపు ఆటోమేషన్‌పై అమెజాన్ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. అమెజాన్ తన ఉద్యోగులను ఏండ్ల తరబడి రోబోలుగా పరిగణిస్తోందని వర్కర్స్ యూనియన్ మండిపడింది. అమెజాన్ ఆటో్మేషన్ ప్రక్రియ కొలువుల కోత దిశగా వేస్తున్న అడుగులేనని, ఇప్పటికే ఫుల్ఫిల్మెంట్ సెంటర్లలో వందలాది ఉద్యోగాలు కనుమరుగయ్యాయని బ్రిటన్ ట్రేడ్ యూనియన్ జీఎంబీ నిర్వాహకులు స్టువార్ట్ రిచర్డ్స్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇక డిజిట్ రోబోను ఆరేగాన్కు చెందిన స్టార్టప్ డెవలప్ చేసింది. డిజిట్ రెండు కాళ్లతో నడస్తుండగా ఇది 5.9 అడుగుల పొడవుతో 65 కిలోల బరువు ఉంది.
Read More :