Amazon Great Indian Festival | పండుగ సీజన్ కోసం ఈ-కామర్స్ దిగ్గజం ‘అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్-2023’ ప్రారంభమైంది. అమెజాన్ ప్రైమ్ మెంబర్ల కోసం శుక్రవారం అర్ధరాత్రి సేల్స్ మొదలయ్యాయి. ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ కూడా ఇప్పుడే ప్రారంభం కావడం గమనార్హం. స్మార్ట్ ఫోన్లు, లాప్ టాప్స్, స్మార్ట్ వాచీలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలపై ఆఫర్లు అందిస్తోంది అమెజాన్. సెలెక్టెడ్ బ్యాంక్ కార్డులపైన అదనపు డిస్కౌంట్లు, ఎక్స్చేంజ్ ఆఫర్లు అందిస్తున్నారు.
* శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఫోన్ పై రూ.6,000 డిస్కౌంట్, ఎక్స్చేంజ్ బోనస్‌గా రూ.8,000.
* శాంసంగ్ గెలాక్సీ జడ్ ఫిలిప్ 5, గెలాక్సీ జడ్ ఫోల్డ్ 5 ఫోన్లపై రూ.7,749 నుంచి నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు.
* హానర్ 90 5జీ ఫోన్ అన్ని ఆఫర్లతో రూ.26,999. ఫస్ట్ క్వాడ్ కర్వ్డ్ అమోలెడ్ డిస్ ప్లే కలిగి ఉంటుంది.
* ఇటీవల మార్కెట్లో ఆవిష్కరించిన నోకియా జీ42 5జీ ఫోన్ అన్ని ఆఫర్లతో కలుపుకుని రూ.10,799.
* వన్ ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీ, షియోమీ 13 ప్రో 5జీ, మోటరోలా రేజర్ 40 ఆల్ట్రా, ఐక్యూ జడ్ ప్రో 5జీ ఫోన్లపై డిస్కౌంట్లు.
* రూ.899లకే రెడ్మీ బడ్స్ 4 యాక్టివ్.
* నాయిస్, బోట్, ఫైర్ బోల్ట్ తరహా బ్రాండ్ల స్మార్ట్ వాచీల ధరలు రూ.1,499 నుంచి ప్రారంభం.
* ఆపిల్ వాచ్ ఎస్ఈ (జీపీఎస్ + సెల్యూలార్) రూ.19,990లకే లభ్యం.
* ఆపిల్ మ్యాక్ బుక్ ఎయిర్ ఎం1 ధర రూ.62,990. 12 నెలల గడువుతో నో -కాస్ట్ ఈఎంఐ ఆప్షన్.
* అసుస్ వివో బుక్ 15 ఇంటెల్ 17, డెల్ 14 ఇంటెల్ కోర్ ఐ5, హెచ్‌పీ విక్టస్ ఆర్టీఎక్స్ 3050 తదితర లాప్‌టాప్‌లపై ఆకర్షణీయ ఆఫర్లు.
* సోనీ, శాంసంగ్, ఎల్జీ, రెడ్మీ, హైసెన్స్, ఎసెర్, టీసీఎల్, వియూ బ్రాండ్ టీవీలపై ఆకర్షణీయ ఆఫర్లు, నో-కాస్ట్ ఈఎంఐ ఆఫర్లతోపాటు.. నౌ బై పే లేటర్ ఆప్షన్.