Amazon Great Indian Festival 2024 Sale | మరో ఐదు రోజుల్లో అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ – 2024 సేల్ ప్రారంభం కానున్నది. రానున్న ఫెస్టివల్ సీజన్ నేపథ్యంలో టాప్ స్మార్ట్ ఫోన్లపై అమెజాన్ ఆకర్షణీయ ఆఫర్లు ప్రకటించింది. అమెజాన్ సేల్ కింద ఐ-ఫోన్ 13 ఫోన్ రూ.38 వేల లోపు ధరకే సొంతం చేసుకోవచ్చు. అలాగే, శాంసంగ్ గెలాక్సీ ఎస్23, షియోమీ 14 ఫోన్లు రాయితీ ధరకే అందిస్తోంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ద్వారా స్మార్ట్ ఫోన్లు కొనుగోలు చేసే వారికి 40 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. ఈ నెల 26 నుంచే అమెజాన్ ప్రైమ్ మెంబర్లకు ఈ ఆఫర్లు వర్తిస్తాయి.
ఐ-ఫోన్ 13 మీద అమెజాన్ తన ‘కింగ్ ఆఫ్ ఆల్ డీల్స్’ బయట పెట్టింది. రూ.79,900లకు మార్కెట్లో ఆవిష్కరించిన ఐ-ఫోన్ 13 ఫోన్ ప్రస్తుతం రిటైల్ షాపుల్లో రూ.49,900లకు లభిస్తుంది. కానీ, అమెజాన్ ద్వారా కొనుగోలు చేసే వారు రూ.37,999లకే సొంతం చేసుకోవచ్చు. ఆపిల్ ఐ-ఫోన్ 13 ఫోన్ 6.1 అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ డిస్ప్లే , ఆపిల్ ఏ15 బయోనిక్ ప్రాసెసర్, 12 మెగా పిక్సెల్ డ్యుయల్ రేర్ కెమెరా కలిగి ఉంటుంది.
ఆపిల్ ఐ-ఫోన్ 13 ఫోన్‌తోపాటు శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఆల్ట్రా ఫోన్ లాంచింగ్ ధర రూ.1,49,999. కాగా, ప్రస్తుతం రూ.69,999లకే ఈ ఫోన్ సొంతం చేసుకోవచ్చు. చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ షియోమీకి చెందిన షియోమీ14 ఫోన్ లాంచింగ్ ధర రూ.69,999 కాగా, ఇప్పుడు రూ.47,999లకే లభ్యం అవుతుంది. ఈ డిస్కౌంట్లలో బ్యాంకు డిస్కౌంట్లు, కూపన్ డిస్కౌంట్లు కలగలిసి ఉన్నాయి.