Amazon Great Indian Festival 2024 Sale | ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్ ‘అమెజాన్’ ప్రతి ఏడాది మాదిరే ఈ ఏడాది ‘అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్-2024’ ప్రకటించింది. ఎట్టకేలకు సేల్స్ తేదీలు కూడా వచ్చేశాయి. ఐ-ఫోన్ 13, శాంసంగ్ గెలాక్సీ ఎస్24 ఆల్ట్రా, శాంసంగ్ గెలాక్సీ జడ్ ఫిలిప్ 6 వంటి ప్రీమియం సెగ్మెంట్ స్మార్ట్ ఫోన్లపై ఆకర్షణీయమైన ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. స్మార్ట్ ఫోన్లపై 40 శాతం వరకూ ధర తగ్గింపు లభిస్తుంది. దీంతోపాటు ఎస్బీఐ కార్డు యూజర్లు, అమెజాన్ ప్రైమ్ మెంబర్లకు మరిన్ని బెనిఫిట్లు, ఎక్స్చేంజ్ బోనస్ ఆఫర్లు కూడా ఉన్నాయి. ఈ నెల 27 నుంచి అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్-2024 ప్రారంభం అవుతుంది. అమెజాన్ ప్రైమ్ సభ్యులకు సెప్టెంబర్ 26 అర్ధరాత్రి నుంచే సేల్స్ ఆఫర్లు అందుబాటులోకి వస్తాయి. ఇదే సమయంలో మరో ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్ ‘ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్’ కూడా కూడా అందుబాటులో ఉంది.
ఆపిల్ ఏ15 బయోనిక్ ఎస్వోసీ ప్రాసెసర్, డ్యుయల్ రేర్ కెమెరా సెటప్, ఈ నెల 16న విడుదలైన ఐఓఎస్ 18 అప్ డేట్ తో వస్తున్న ఐఫోన్ 13పై భారీ డిస్కౌంట్లు లభిస్తాయి. శాంసంగ్ గెలాక్సీ ఎస్24 ఆల్ట్రా 5జీ, శాంసంగ్ గెలాక్సీ జడ్ ఫోల్డ్ 6, శాంసంగ్ గెలాక్సీ జడ్ ఫిలిప్ 6 ఫోన్లు తక్కువ ధరకే లభిస్తాయి. షియోమీ 14 సివి ఫోన్ తోపాటు వన్ ప్లస్ 12 సిరీస్ ఫోన్లపైనా భారీ డిస్కౌంట్లు అందిస్తోంది అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్. తాజాగా మార్కెట్లో ఆవిష్కరించిన మోటరోలా రేజర్ 50 సిరీస్ ఫోన్లపై డిస్కౌంట్లు ప్రకటించారు. టెక్నో, ఐటెల్, వివో వంటి బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్లపై తక్కువ ధరలు అందుబాటులో ఉన్నాయి.
డిస్కౌంట్లతోపాటు క్యాష్ బ్యాక్ ఆఫర్లు, నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు లభిస్తాయి. అమేజాన్ పే, పే లేటర్ బేస్డ్ పేమెంట్ ఆఫర్లు, కూపన్ డిస్కౌంట్లు ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఎస్బీఐ డెబిట్ లేదా క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేసే వారికి 10 శాతం ఇన్ స్టంట్ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది అమెజాన్.