Amazon on Future | రిలయన్స్ రిటైల్‌లో ఫ్యూచర్ రిటైల్ విలీనాన్ని వ్యతిరేకిస్తున్న గ్లోబల్ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌కు మంచి బూస్ట్ లభించింది. రిలయన్స్‌లో ఫ్యూచర్ రిటైల్ విలీనాన్ని నిలిపివేస్తూ గతేడాది జారీ చేసిన అత్యవసర ఆదేశాలను కొట్టేయాలన్న పిటిషన్‌ను సింగపూర్ అంతర్జాతీయ మధ్యవర్తిత్వ న్యాయస్థానం తిరస్కరించిందని రాయిటర్స్ ఓ వార్తా కథనం ప్రచురించింది. ఫ్యూచర్ గ్రూప్-అమెజాన్ మధ్య వివాదంలో ఫ్యూచర్ రిటైల్‌ను వాదిగా చేర్చిన మరునాడే సింగపూర్ అంతర్జాతీయ మధ్యవర్తిత్వ న్యాయస్థానం ఈ తీర్పుఇవ్వడం గమనార్హం.
రిలయన్స్ రిటైల్‌లో రూ.24,713 కోట్లకు విలీనం చేసేందుకు ఫ్యూచర్ రిటైల్ గ్రూప్ గతేడాది ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. కానీ ఫ్యూచర్ గ్రూప్ అంతకుముందు చేసుకున్న కాంట్రాక్ట్ ఒప్పందాలను ఉల్లంఘిస్తోందని అమెజాన్ వాదిస్తోంది. కానీ తామేమీ పొరపాటు చేయలేదని ఫ్యూచర్ వాదిస్తున్నది. గతేడాది రిలయన్స్‌లో విలీనానికి ఒప్పందం కుదుర్చుకున్న ఫ్యూచర్ గ్రూప్.. అమెజాన్-ఫ్యూచర్ కూపన్స్ వివాదంతో సంబంధం లేదని వాదిస్తున్నది.
ఎమర్జెన్సీ ఆర్బిటేటర్ ఇంటరిం అవార్డును వేకేట్ చేయాలని తాము దాఖలు చేసిన పిటిషన్‌ను సింగపూర్ అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కోర్టు గురువారం కొట్టేసిందని ఫ్యూచర్ రిటైల్ శుక్రవారం రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొన్నది. దీనిపై చట్టానికి అనుగుణంగా, లీగల్ అడ్వైజ్కు అనుగుణంగా అందుబాటులో ఉన్న అవకాశాలను బట్టి భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించుకుంటామని ఫ్యూచర్ గ్రూప్ తెలిపింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Hyderabad | ఆఫీస్ స్పేస్‌లో హైదరాబాద్ అగ్రస్థానం
Bullet Doctor : బుల్లెట్ బండి డాక్టర్.. ఈయన స్పెషాలిటీ ఏంటో తెలుసా?
మ్యాట్రిమోనియల్ సైట్లో పరిచయమైన మహిళపై కన్నేసి ఆపై లైంగిక దాడి!
నంబర్ 16 నుంచి ‘ఇండియాజాయ్’.. తెలంగాణ ప్రభుత్వం మద్దతు