హైదరాబాద్, మే 29: అమర రాజా ఎనర్జీ అండ్ మొబిలిటీ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికిగాను రూ.2,974 కోట్ల ఆదాయంపై రూ.224 కోట్ల పన్నులు చెల్లించకముందు నికర లాభాన్ని గడించింది.
అలాగే 2024-25 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.12,405 కోట్ల ఆదాయంపై రూ.1,299 కోట్ల లాభాన్ని నమోదు చేసుకున్నది. దీంతోపాటు ప్రతిషేరుకు రూ.5.20 డివిడెండ్‌ను ప్రతిపాదించింది.