న్యూఢిల్లీ : తమ తొలి కమర్షియల్ విమాన సేవలు ఆగస్ట్ 7న ప్రారంభమవుతాయని న్యూ ఎయిర్‌లైన్ ఆకాశ శుక్రవారం వెల్లడించింది. బోయింగ్ 737 మ్యాక్స్‌తో ముంబై-అహ్మదాబాద్ రూట్లో తొలి విమానం టేకాఫ్ అవుతుందని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఆగస్ట్ 7 నుంచి ముంబై-అహ్మదాబాద్ రూట్లో 28 వీక్లీ విమానాలు, బెంగళూర్-కొచ్చి రూట్లో 28 వీక్లీ విమానాలు ఆగస్ట్ 13 నుంచి సేవలు అందిస్తాయని ఎయిర్‌లైన్ తెలిపింది.
ఆయా రూట్లలో టికెట్ల సేల్స్ ఓపెన్ అయ్యాయని తెలిపింది. రెండు 737 మ్యాక్స్ ఎయిర్‌క్రాఫ్ట్‌లతో ఆకాశ తన కమర్షియల్ ఆపరేషన్స్‌ను లాంఛ్ చేస్తోంది. ఇక బోయింగ్ ఓ మ్యాక్స్ ప్లేన్‌ను డెలివరీ చేయగా మరో మ్యాక్స్ ప్లేన్ ఈ నెలాఖరులో డెలివరీ కానుంది. బ్రాండ్ న్యూ బోయింగ్ 737 మ్యాక్స్ విమానంతో ముంబై, అహ్మదాబాద్ మధ్య ఆపరేషన్స్‌ను ప్రారంభిస్తామని ఆకాశ ఎయిర్ సహ వ్యవస్ధాపకుడు, చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ ప్రవీణ్ అయ్యర్ తెలిపారు.
క్రమంగా పలు నగరాలను కలుపుతూ దశలవారీగా నెట్‌వర్క్‌ను విస్తరిస్తామని చెప్పారు. తొలి ఏడాదిలో ప్రతి నెలా రెండు విమానాలను సమీకరిస్తామని తెలిపారు. ఇక జులై 7న ఆకాశ ఎయిర్‌కు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నుంచి ఎయిర్ ఆపరేటర్ సర్టిఫికెట్ లభించింది. 72 మ్యాక్స్ ఎయిర్‌క్రాఫ్ట్‌ల కొనుగోలుకు సంబంధించి గత ఏడాది నవంబర్ 26న బోయింగ్‌తో ఆకాశ ఎయిర్ ఒప్పందంపై సంతకాలు చేసింది.