న్యూఢిల్లీ, ఆగస్టు 28: గత కొన్ని నెలలుగా మొబైల్ వినియోగదారులను ఆకట్టుకోవడంలో దూసుకుపోయిన జియోకు ఎయిర్టెల్ షాకిచ్చింది. జూలై నెలలో భారతీ ఎయిర్‌టెల్‌ను 26.8 లక్షల మంది మొబైల్ యూజర్లు జత కాగా, ఇదే నెలలో జియో నెట్‌వర్క్‌ను 24.4 లక్షల మంది ఎంచుకున్నారు. టెలికాం నియంత్రణ మండలి ట్రాయ్ తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది.
అలాగే వొడాఫోన్ ఐడియా నెట్‌వర్క్‌ను 2.4 లక్షల మంది ఎంచుకోగా..బీఎస్ఎన్ఎల్ లోకి 1.68 లక్షల మంది చేరారు. మొత్తంగా చూస్తే గత నెలలో 55.38 లక్షల మంది వైర్లెస్ కస్టమర్లు జతవడంతో మొత్తం సంఖ్య 128.79 కోట్లకు చేరుకున్నారు. దీంట్లో భారతీ ఎయిర్టెల్ వైర్లెస్ సబ్‌స్ర్కైబర్ల సంఖ్య 48.94 కోట్లకు చేరుకోగా, జియో 50.60 కోట్లు, వొడాఫోన్ ఐడియి 19.90 కోట్లకు చేరారు. దీంతోపాటు 108.75 కోట్లుగా ఉన్న బ్రాడ్‌బ్యాండ్ సబ్‌స్ర్కైబర్లు గత నెల చివరినాటికి 109.44 కోట్లకు చేరారు.