Airtel | న్యూఢిల్లీ, సెప్టెంబర్ 25: స్పామ్ కాల్స్, మెసేజ్‌లతో విసిగిపోయిన వారికి శుభవార్తను అందించింది ప్రముఖ టెలికం సంస్థ భారతీ ఎయిర్టెల్. వీటికి చెక్ పెట్టడానికి ప్రత్యేకంగా ఏఐ సాయం తో కొత్త టెక్నాలజీ సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు భారతీ ఎయిర్టెల్ ఎండీ, సీఈవో గోపాల్ విఠల్ తెలిపారు. ఈ సదుపాయం గురువారం అర్ధరాత్రి నుంచి అందుబాటులోకి రానున్నట్లు చెప్పారు.
స్పామ్ కాల్స్, మెసేజ్‌లు వచ్చినప్పడు యూజర్లకు కేవలం 2 మిల్లీసెకండ్లలో సమాచారం ఇవ్వనున్నదని, దీంతో యూజర్ వెంటనే అలర్ట్ అయ్యేందుకు వీలుంటుందన్నారు. ఎయిర్టెల్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఈ సేవలను ఉచింతగా పొందవచ్చునని చెప్పారు.ఈ నూతన టెక్నాలజీ సేవలు కేవలం 2 మిల్లీ సెకన్లలోనే 150 కోట్ల మెసేజ్‌లు, 250 కోట్ల కాల్స్‌ను ప్రాసెస్ చేయగలదని ఆయన చెప్పారు.