Nokia | న్యూఢిల్లీ, నవంబర్ 20: ఫిన్లాండ్కు చెందిన టెలికం గేర్ల సరఫరా సంస్థ నోకియా.. ప్రముఖ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ నుంచి భారీ ఆర్డర్ పొందింది. దేశంలోని వివిధ రాష్ర్టాలు, నగరాల్లో 4జీ, 5జీ ఉపకరణాలు అమర్చేందుకుగాను కోట్లాది రూపాయల ఒప్పందాన్ని కుదుర్చుకున్నది. ఈ ఒప్పందం ప్రకారం 5జీ నెట్‌వర్క్‌కు సంబంధించి బేస్ స్టేషన్ల ఏర్పాటు, బేస్‌బ్యాండ్ యూనిట్లు తదితర ఉపకరణాలు అమర్చనున్నది.
ప్రస్తుతం 4జీ నెట్‌వర్క్‌కు సంబంధించి మల్టీ బ్రాండ్ రేడియోలు, బేస్‌బ్యాండ్ ఎక్విప్మెంట్ అమర్చేందుకు ఈ కాంట్రాక్టు కుదిరినట్లు తెలిపింది. కస్టమర్లకు మెరుగైన సేవలు అందించడానికి ఈ ఒప్పందం దోహదం చేయనున్నదని భారతీ ఎయిర్టెల్ వైస్ చైర్మన్, ఎండీ గోపాల్ విఠల్ తెలిపారు. గడిచిన రెండు దశాబ్దాలుగా నోకియాతో కలిసి పనిచేస్తున్నట్లు, 2జీ, 3జీ, 4జీ, 5జీ నెట్‌వర్క్‌ను విస్తరించడానికి సంస్థ అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించినట్లు చెప్పారు. ఈ ఒప్పందంతో గ్రీన్ 5జీ నెట్‌వర్క్‌ను విస్తరించడానికి దోహదం చేయనున్నదని, అలాగే ఎయిర్టెల్ నెట్‌వర్క్‌లో విద్యుత్ ఆదా కావడంతోపాటు కాలుష్యం తగ్గనున్నదన్నారు.