హైదరాబాద్, జనవరి 31: ప్రముఖ టెలికం సంస్థ భారతీ ఎయిర్టెల్ కూడా రాష్ట్రంలో 5జీ సేవలను విస్తరించింది. ఇప్పటికే హైదరాబాద్‌లో ఈ సేవలు అందిస్తుండగా.. తాజాగా వరంగల్, కరీంనగర్‌లలో ఈ సేవలు ప్రారంభించినట్లు వెల్లడించింది.
ఇందుకోసం సిమ్ మార్చుకోవాల్సిన అవసరం లేదని పేర్కొంది. 5జీ స్మార్ట్‌ఫోన్ కలిగిన వినియోగదారులు అత్యంత వేగవంతమైన ఎయిర్టెల్ 5జీ ప్లస్ సేవలు, ముఖ్యంగా 4జీ కంటే 20-30 రెట్లు అధికంగా పొందవచ్చునని కంపెనీ సీఈవో శివన్ భార్గవ తెలిపారు.