న్యూఢిల్లీ, జనవరి 31: దేశీయ విమానయాన సంస్థల నుంచి మూడు హెలికాప్టర్ల ఆర్డర్లు వచ్చాయని ఎయిర్‌బస్ ప్రకటించింది. వీటిలో హెచ్175 హెలికాప్టర్ ఒకటి కాగా, మరో రెండు ఏసీహెచ్160 ఉన్నాయని పేర్కొంది. ఇప్పటికే దేశీయంగా ఏసీహెచ్160 హెలికాప్టర్‌కు కస్టమర్లు ఉండగా, హెచ్175 తొలి కస్టమర్ అని వెల్లడించింది. ఎవరు బుకింగ్ చేసుకున్నారు..ఆర్థిక వివరాలు మాత్రం సంస్థ వెల్లడించలేదు. వీటిలో 16 సీట్ల సామర్థ్యంతో రూపొందించిన హెచ్175 హెలికాప్టర్‌ను ఈ ఏడాది చివరినాటికి డెలివరీ చేయనున్నది.