దేశీయ విమానయాన సంస్థల నుంచి మూడు హెలికాప్టర్ల ఆర్డర్లు వచ్చాయని ఎయిర్‌బస్ ప్రకటించింది. వీటిలో హెచ్175 హెలికాప్టర్ ఒకటి కాగా, మరో రెండు ఏసీహెచ్160 ఉన్నాయని పేర్కొంది.
దేశీయ విమానయాన సంస్థ ఇండిగో విమానాల రద్దు ఆరో రోజైన ఆదివారం కూడా కొనసాగింది. తాజాగా 650 విమానాలు రద్దు చేయగా, మొత్తం 2,300 విమానాలకు 1,650 నడిపినట్టు ఆ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.