న్యూఢిల్లీ, మే 23: విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా..సమ్మర్ సేల్ పేరుతో ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఆఫర్ కింద ఒకవైపు దేశవ్యాప్తంగా ప్రారంభ విమాన టికెట్ ధరను రూ.1,199గా నిర్ణయించిన సంస్థ..అంతర్జాతీయ రూట్లలో రూ.11,969గా నిర్ణయించింది.
ఈ నెల 25 అర్ధరాత్రి వరకు అందుబాటులో ఉండనున్న ఈ ప్రత్యేక ఆఫర్ కింద బుకింగ్ చేసుకున్న ప్రయాణికులు సెప్టెంబర్ 30లోగా, అంతర్జాతీయ రూట్లలో డిసెంబర్ 10లోగా ప్రయాణించాల్సి వుంటుందని పేర్కొంది. ఎయిర్ ఇండియా వెబ్సైట్, మొబైల్ యాప్ ద్వారా బుకింగ్ చేసుకున్నవారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తించనున్నదని తెలిపింది.