మచిలీపట్నం, జూన్ 15: విజయవాడ నుంచి ముంబైకి డైరెక్ట్ విమాన సేవలు ప్రారంభించింది ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్. గన్నవరంలోని విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ విమాన సేవలు శనివారం ప్రారంభించారు. ముంబైలో మధ్యా హ్నం 3.55 గంటలకు బయలుదేరనున్న ఏ-320 విమాన సర్వీసు విజయవాడకు సాయంత్రం 5.45కి చేరుకోనున్నది. తిరుగు ప్రయాణంలో విజయవాడలో 7.10 గంటలకు బయలుదేరి ముంబైకి రాత్రి 9 గంటలకు చేరుకోనున్నది.