Air India | భారతదేశ ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా పైలట్ల పదవీ విరమణ వయస్సును 65 సంవత్సరాలకు, నాన్-ఫ్లైయింగ్ సిబ్బందిని 60 సంవత్సరాలకు పెంచాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఎయిర్లైన్లో పైలట్లు, నాన్-ఫ్లైయింగ్ సిబ్బంది పదవీ విరమణ వయస్సు 58 సంవత్సరాలు. పదవీ విరమణ వయస్సును పెంచుతున్నట్లు ఇటీవల జరిగిన కంపెనీ సమావేశంలో సీఈవో, ఎండీ కాంప్బెల్ విల్సన్ ప్రకటించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ విషయంలో ఎయిర్ ఇండియా నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియాలో 3,600 మంది పైలట్లు, 9,500 మంది క్యాబిన్ సిబ్బందితో సహా దాదాపు 24వేల మంది ఉద్యోగులు ఉన్నారు. ఎయిర్ ఇండియాలో 58 సంవత్సరాలుగా ఉన్న క్యాబిన్ సిబ్బంది పదవీ విరమణ వయస్సును పెంచారా? లేదా? సమాచారం తెలియరాలేదు.
వాస్తవానికి నవంబర్ 2024లో టాటా గ్రూప్ విస్తారా ఎయిర్ ఇండియాలో విలీనం అయ్యింది. అప్పటి నుంచి ఎయిర్ ఇండియాలోని కొంతమంది పైలట్లు పదవీ విరమణ వయసులో తేడాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ తాజా నిర్ణయంతో ఈ వైరుధ్యానికి ముగింపు పలికినట్లేనని భావిస్తున్నారు. ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం, క్యాబిన్ సిబ్బంది పదవీ విరమణ వయస్సు 58 సంవత్సరాలు. దాన్ని పెంచడంపై క్లారిటీ ఇవ్వలేదు. ఇటీవలకాలంలో చాలా మంది సిబ్బంది ఎయిర్ ఇండియాను వీడిపోయారు. కొంతమంది పైలట్లు, క్యాబిన్ సిబ్బంది రాజీనామా చేశారు. ఈ సందర్భంలో కంపెనీ సీఈవో కాంప్బెల్ విల్సన్ టౌన్ హాల్ సమావేశంలో మాట్లాడుతూ పదవీ విరమణ పెంపుతో సిబ్బంది స్థిరత్వం, అనుభవాన్ని కొనసాగించడంలో సహాయపడుతుందని తెలిపినట్లు సమాచారం.