హైదరాబాద్, డిసెంబర్ 31: ఎయిర్ ఇండియా అనుబంధ సంస్థ ఎయిర్ ఇండి యా ఎక్స్ప్రెస్ విస్తరణ బాటపట్టింది. ఇప్పటికే పలు అంతర్జాతీయ రూట్లలో విమాన సర్వీసులు అందిస్తున్న సంస్థ..తాజాగా హైదరాబాద్ నుంచి పుకెట్కు మధ్య విమాన సర్వీసును అందుబాటులోకి తీసుకురాబోతున్నది.
జనవరి 31 నుంచి వారానికి మూడు రోజులు బుధ, శుక్ర, ఆది వారాల్లో మాత్రమే ఈ కొత్త సర్వీసు అందుబాటులో ఉండనున్నట్లు పేర్కొంది. ఆ తర్వాతి క్రమంలో ఫిబ్రవరి 15 నుంచి ఈ సర్వీసు బుధవారం మినహా అన్ని రోజులు నడుపనున్నది. ఈ సర్వీసు ప్రారంభ సందర్భంగా ఈ రూట్లో విమాన టికెట్ ధరను రూ.11 వేలుగా నిర్ణయించింది.