Air India Express flight |దుబాయ్ నుంచి కేరళలోని కాలికట్కు వస్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాన్ని కొన్ని గంటల పాటు కోచికి తరలించారు. కోజికోడ్‌లో అననుకూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో శనివారం కాలికట్లో ల్యాండ్ కావాల్సిన విమానాన్ని కోజికోడ్‌కు మళ్లించారు. శనివారం తెల్లవారుజామున 2.47 గంటలకు కొచి విమానాశ్రయంలో ల్యాండయింది. తిరిగి వాతావరణ పరిస్థితులు కుదుట పడిన తర్వాత దాదాపు ఏడు గంటలకు అంటే, ఉదయం 9.30 గంటలకు కొచి నుంచి కాలికట్కు విమానం టేకాఫ్ అయింది. ఈ విమానంలో 173 మంది ప్రయాణికులు ఉన్నారు.
గత నెలలోనూ బెంగళూరు నుంచి కోచికి వస్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమానాన్ని అత్యవసరంగా దించేశారు. తొలుత బెంగళూరులో సదరు విమానం ఇంజిన్లలో ఒక దాంట్లో మంటలు వచ్చినట్లు గుర్తించడంతో ప్రయాణికులందరినీ సురక్షితంగా దింపేశారని, ఎవరికీ గాయాలు కాలేదని ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ ఓ ప్రకటనలో తెలిపింది.