హైదరాబాద్, మే 28: దేశీయ విమానయాన దిగ్గజాల్లో ఒకటైన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ప్రత్యేకంగా తగ్గింపు ధరతో విమాన టికెట్లను విక్రయిస్తున్నది. దేశీయ, అంతర్జాతీయ విమాన టికెట్లపై 50 శాతం వరకు రాయితీ ఇస్తున్నట్టు ప్రకటించింది. ఈ నెల 31 వరకు మాత్రమే అందుబాటులో ఉండనున్న ఈ తగ్గింపు ఆఫర్..సీటు సెలెక్షన్, ముందస్తు బుకింగ్ మీల్స్పై 20 శాతం డిస్కౌంట్ను ఇస్తున్నది.
ఈ ఆఫర్ కింద బుకింగ్ చేసుకున్న ప్రయాణికులు జూన్ 15 నుంచి అక్టోబర్ 10 వరకు ఎప్పుడైనా ప్రయాణించాల్సి ఉంటుందని పేర్కొంది. వీటితోపాటు విద్యార్థులకు, సీనియర్ సిటిజన్లకు, దేశీయ భద్రతాదళాలకు తగ్గింపు ధరతో విమాన టికెట్లను విక్రయిస్తున్నట్టు చెప్పారు.