Air India Express | న్యూఢిల్లీ, మే 16: టాటా గ్రూపునకు చెందిన విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ మరో ప్రత్యేక ఆఫర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ‘ఫ్లాష్ సేల్’ పేరుతో ప్రకటించిన ఈ ఆఫర్ కింద ప్రారంభ విమాన టికెట్ ధరను రూ.1,300గా నిర్ణయించింది.
www.airindiaexpress.com లేదా మొబైల్ యాప్ ద్వారా బుకింగ్ చేసుకున్న వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తించనున్నది. ఈ నెల 18 వరకు బుకింగ్ చేసుకున్న ప్రయాణికులు జూన్ 1 నుంచి సెప్టెంబర్ 15 లోగా ప్రయాణించాల్సివుంటుందని పేర్కొంది.