ముంబై, జూలై 11: ఈ-రుపీ లావాదేవీలను పెంపొందించడానికి రిజర్వు బ్యాంక్ తగిన చర్యలు తీసుకుంటుంది. ఈ ఏడాది చివరినాటికి సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ(సీబీడీసీ)ని రోజుకు 10 లక్షలు లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ టీ రవి శంకర్ తెలిపారు. ప్రస్తుతం రోజుకు 5 వేల నుంచి 10 వేల వరకు ఈ-రుఫీ లావాదేవీలు జరుగుతున్నాయి.
ఈ ఏడాది జూన్ పరపతి సమీక్షలో ఈ సీబీడీసీని ప్రవేశపెట్టబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సీబీడీసీలోకి మరిన్ని బ్యాంకులు రావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని ఆయన వ్యాఖ్యానించారు.