AI Express-AIX Connect | టాటా సన్స్ ఆధీనంలోని ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్, ఏఐఎక్స్ కనెక్ట్ విమాన యాన సంస్థల విలీన ప్రక్రియ వచ్చే నెల మొదటి వారంలో పూర్తి కానున్నది. అలాగే ఏఐఎక్స్ కనెక్ట్ ఎయిర్ లైన్ డిజిగ్నేటర్ కోడ్ ‘ఐ5 (I5)’ కూడా కనుమరుగు కానున్నది. ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ (Air India Express) రియాల్టీ కానున్నది. రెండు సంస్థల విలీన ప్రక్రియ ఏడాది కాలంగా కొనసాగుతున్నది. ఇంతకుముందు ఎయిర్ ఏషియా ఇండియాగా మొదలైన విమానయాన సంస్థ తదుపరి ఏఐఎక్స్ కనెక్ట్‌గా రూపాంతరం చెందింది.
ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్‌లో విలీనం పూర్తయిన తర్వాత వచ్చేనెల మొదటి వారంలో ఏఐఎక్స్ కనెక్ట్ ‘ఎయిర్ ఆపరేటర్ సర్టిఫికెట్ (ఏఓసీ)’.. ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ ఏఓసీకి బదిలీ అవుతుంది. ప్రస్తుతం ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్, ఏఐఎక్స్ కనెక్ట్ ప్రతి రోజూ సుమారు 400 విమాన సర్వీసులు నడుపుతున్నాయి. వాటిలో 61 బోయింగ్ 737 ఎన్జీఎస్ అండ్ మ్యాక్స్ 27 ఏ320 సీఈఓస్ అండ్ నియోస్ విమానాలు కూడా ఉన్నాయి. రెండు సంస్థల విలీన ప్రక్రియ సజావుగా సాగడానికి ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్, ఏఐఎక్స్ కనెక్ట్ మధ్య వార్ రూమ్ ఏర్పాటు చేసి, కార్యకలాపాలను పర్యవేక్షించారు.