AI | ఆర్ట్‌తో ఏఐని మేళవిస్తే అద్భుతాల ఆవిష్కరణ
లాస్ఏంజెల్స్లో అడోబ్ మ్యాక్స్ 2023 వేదికగా అడోబ్ సీఈవో శంతను నారాయణ్ అద్భుత ఏఐ (AI) ఫీచర్స్‌ను ప్రకటిస్తారని భావిస్తున్నారు.
న్యూయార్క్ : లాస్ఏంజెల్స్లో అడోబ్ మ్యాక్స్ 2023 వేదికగా అడోబ్ సీఈవో శంతను నారాయణ్ అద్భుత ఏఐ (AI) ఫీచర్స్‌ను ప్రకటిస్తారని భావిస్తున్నారు. క్రియేటివిటీని ఏఐ మింగేస్తుందా అన్న హాట్ డిబేట్ సాగుతుండగా క్రియేటివ్ ప్రొఫెషనల్స్ భవితవ్యంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే అడోబ్ వార్షిక సదస్సుకు హాజరైన పలువురు ఆర్టిస్టులు మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
ఏఐ టూల్స్ తమ సమయాన్ని ఆదా చేస్తాయని, వీటిని సరైన విధంగా వాడితే అద్భుత విషయాలను ఆవిష్కరించడంలో తమకు సహకరిస్తాయని ఆర్టిస్టులు చెబుతున్నారు. ఆర్టిస్కు ఏఐ తోడైతే అది బెస్ట్ కాంబినేషన్ అవుతుందని ఒడిషా, బలిపడకు చెందిన చైల్డ్ ఫొటోగ్రాఫర్ సత్యం భుయన్ పేర్కొన్నారు.
ఆర్ట్, ఏఐ రెండూ వేర్వేరు విషయాలని, వీటిని మీరు కలిపితే మీ పనులు మరింత మెరుగ్గా చక్కబెట్టవచ్చని ఆరేండ్ల కిందట ఫొటోగ్రాఫర్‌గా మారిన సత్యం చెప్పుకొచ్చారు. దీనికోసం మీరంతా న్యూ సాఫ్ట్‌వేర్‌కు అప్డేట్ కావడం, ప్రాక్టీస్ చేయడం, ఏఐ, ఆర్ట్‌ను మేళవించడం చేయాలని సూచించారు. స్టన్నింగ్ ఇమేజ్‌లను క్రియేట్ చేసే సామర్ధ్యం ఏఐకి ఉందని ఓపెన్ఏఐ డాల్-ఈ, మిడ్‌జర్నీ చూపాయని గుర్తుచేశారు.
Read More :
Election Code | హైదరాబాద్‌లో భారీగా నగదు సీజ్.. బంగారం పట్టివేత
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- AI
- ART
- Business news
- magical things
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

