Infinix | బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్లు, లాప్టాప్ల తయారీ సంస్థగా పేరొందిన ఇన్ఫినిక్స్.. త్వరలో తన మార్కెట్‌ను టాబ్లెట్ సెగ్మెంట్లోకి విస్తరించేందుకు ప్లాన్ చేస్తోంది. ఇటీవలే తొలి గేమింగ్ లాప్ టాప్, సెకండ్ జనరేషన్ గేమింగ్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి ఆవిష్కరించిన ఇన్ఫినిక్స్.. ‘ఇన్ఫినిక్స్ ఎక్స్ పాడ్ (Infinix XPAD)’ టాబ్లెట్ ఆవిష్కరించేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం ఇన్ఫినిక్స్ ఎక్స్ పాడ్ అభివృద్ధి దశలో ఉంది. దీన్ని భారత్ మార్కెట్లో ఆవిష్కరిస్తారా? లేదా? అన్నది తెలియరాలేదు. ఈ టాబ్లెట్ బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుందని తెలుస్తోంది. మొబైల్ సిమ్ కార్డు మద్దతుతో ఇన్ఫినిక్స్ ఎక్స్ పాడ్ పని చేస్తుందని సమాచారం. వై-ఫై కనెక్షన్ లేకుండానే ఇంటర్నెట్ మొబైల్ డేటా వాడుకోవచ్చు. ఈ నెల 21న భారత్ మార్కెట్లో ఇన్ఫినిక్స్ నోట్ 40 ఫోన్ ను భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. తాజాగా మార్కెట్లో ఆవిష్కరించనున్న టాబ్లెట్ ఇన్ఫినిక్స్ ఎక్స్ పాడ్ రూ.20 వేల లోపు ఉండొచ్చు. 15వాట్ల వైర్ లెస్ మ్యాగ్ చార్జి మద్దతు కలిగి ఉంటుందని కంపెనీ వర్గాలు తెలిపాయి.