గూగుల్, మైక్రోసాఫ్ట్ బాటలో లేఆఫ్స్ బాంబు పేల్చనున్న స్పాటిఫై
టెక్ దిగ్గజాలు గూగుల్, మైక్రోసాఫ్ట్ రెండూ కలిపి గత వారం ప్రపంచవ్యాప్తంగా 22,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించగా తాజాగా మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాం స్పాటిఫై పలువురు ఉద్యోగులను సాగనంపేందుకు సన్నాహాలు చేపట్టింది.
న్యూఢిల్లీ : టెక్ దిగ్గజాలు గూగుల్, మైక్రోసాఫ్ట్ రెండూ కలిపి గత వారం ప్రపంచవ్యాప్తంగా 22,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించగా తాజాగా మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాం స్పాటిఫై పలువురు ఉద్యోగులను సాగనంపేందుకు సన్నాహాలు చేపట్టింది. వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా ఈ వారం లేఆఫ్స్‌పై ప్రకటన చేయనుందని బ్లూమ్‌బర్గ్ రిపోర్ట్ వెల్లడించింది.
స్పాటిఫైలో ఎంతమంది ఉద్యోగులను తొలగించనున్నారనే వివరాలు ఇంకా వెలుగుచూడలేదు. లేఆఫ్స్‌పై స్పాటిఫై పెదవివిప్పకపోయినా పెద్దసంఖ్యలో ఉద్యోగులపై వేటు వేయవచ్చని చెబుతున్నారు. ఈ వారంలోనే స్పాటిఫై లేఆఫ్స్ బాంబు పేల్చనుందని బ్లూమ్‌బర్గ్ రిపోర్ట్ స్పష్టం చేసింది. ఇక గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ 12,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు గతవారం ప్రకటించిన సంగతి తెలిసిందే.
అమెరికాలో కొలువులు కోల్పోయిన ఉద్యోగులకు ఇప్పటికే ఈమెయిల్‌తో లేఆఫ్స్ సమాచారం అందించగా ఇతర దేశాల్లోని బాధిత ఉద్యోగులకూ లేఆఫ్స్‌పై సమాచారం చేరవేస్తారు. ఉద్యోగాలు కోల్పోయిన వారికి పరిహార ప్యాకేజ్ వర్తింపచేస్తామని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ స్పష్టం చేశారు. మరోవైపు ఈకామర్స్ దిగ్గజం అమెజాన్, టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సైతం మాస్ లేఆఫ్స్‌ను ప్రకటించాయి. కంపెనీలు భారీగా కొలువుల కోతకు దిగుతుండటంతో ఉద్యోగ భద్రతపై టెకీల్లో గుబులు రేగుతోంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Proteins | మహిళలు రోజూ ఎంత మొత్తంలో ప్రోటీన్లను తీసుకోవాలి.. ఎలాంటి వ్యాయామాలు చేయాలి..?
Mushfiqur Rahim | టెస్టు క్రికెట్లో చరిత్ర సృష్టించిన బంగ్లా బ్యాటర్ ముష్ఫికర్..!
Garividi Lakshmi OTT | ఓటీటీలోకి వస్తున్న ‘గరివిడి లక్ష్మి’.. ఆనంది నటించిన బయోపిక్ ఎక్కడ చూడొచ్చంటే?
Perni Nani | ఎన్నికల్లో దౌర్జన్యాలకు పాల్పడి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన చంద్రబాబు : మాజీ మంత్రి పేర్నినాని
‘తాగునీటి భద్రతకు అత్యంత ప్రాధాన్యం’
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

