జీడీపీకి ఏడీబీ కోత
అంతర్జాతీయ సంస్థలు వరుసపెట్టి భారత వృద్ధి రేటుకు కోత పెడుతున్న సమయంలోనే మరో ప్రపంచ సంస్థ సైతం కత్తెరవేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి దేశ జీడీపీ వృద్ధి అంచనాల్ని ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ) తగ్గించింది
- ఈసారి దేశ వృద్ధి 7 శాతమే
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 21: అంతర్జాతీయ సంస్థలు వరుసపెట్టి భారత వృద్ధి రేటుకు కోత పెడుతున్న సమయంలోనే మరో ప్రపంచ సంస్థ సైతం కత్తెరవేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి దేశ జీడీపీ వృద్ధి అంచనాల్ని ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ) తగ్గించింది. అధిక ద్రవ్యోల్బణం, కఠిన ద్రవ్య విధానం కారణంగా వృద్ధి రేటును 7.2 శాతం నుంచి 7 శాతానికి కుదిస్తున్నట్టు ఏడీబీ ప్రకటించింది.
ఆసియన్ డెవలప్మెంట్ అవుట్లుక్ రిపోర్ట్ 2022ను బుధవారం విడుదల చేస్తూ 2022-23 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో సర్వీసుల అండతో భారత్ జీడీపీ 13.5 శాతం వృద్ధి సాధించిందని, అయితే పూర్తి ఏడాదిలో ఈ వృద్ధి 7 శాతానికి పరిమితమవుతుందని, 2023-24లో 7.2 శాతంగా నమోదుకావచ్చని తెలిపింది. భారత్ వృద్ధి రేటును ఏడీబీ తగ్గించడం ఈ ఏడాదిలో ఇది రెండోసారి. ఏప్రిల్లో విడుదల చేసిన నివేదికలో 7.5 శాతం వృద్ధిని అంచనావేయగా, జూలైలో దీనిని 7.2 శాతానికి, తాజాగా 7 శాతానికి దించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

