దర్యాప్తు ఎక్కడిదాక వచ్చింది
క్ ధరల్లో అదానీ గ్రూప్ అక్రమాలపై వచ్చిన ఆరోపణలపై సాగుతున్న దర్యాప్తు ఎక్కడిదాకా వచ్చిందంటూ మంగళవారం మార్కెట్ రెగ్యులేటర్ సెబీని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. విచారణను వేగంగా జరుపాలని, తామిచ్చిన గడువు ఆగస్టు 14లోగా పూర్తిచేయాలని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని అత్యున్నత న్యాయస్థాన త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే వీలైనంత త్వరగానే దర్యాప్తును చేస్తున్నట్టు ఈ కేసులో సెబీ తరఫున వాదిస్తున్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహెతా కోర్టుకు తెలిపారు.
- అదానీ అక్రమాలపై సెబీని ప్రశ్నించిన సుప్రీం కోర్టు
- ఆగస్టు 14లోగా పూర్తి చేయాలంటూ స్పష్టీకరణ
న్యూఢిల్లీ, జూలై 11: స్టాక్ ధరల్లో అదానీ గ్రూప్ అక్రమాలపై వచ్చిన ఆరోపణలపై సాగుతున్న దర్యాప్తు ఎక్కడిదాకా వచ్చిందంటూ మంగళవారం మార్కెట్ రెగ్యులేటర్ సెబీని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. విచారణను వేగంగా జరుపాలని, తామిచ్చిన గడువు ఆగస్టు 14లోగా పూర్తిచేయాలని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని అత్యున్నత న్యాయస్థాన త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే వీలైనంత త్వరగానే దర్యాప్తును చేస్తున్నట్టు ఈ కేసులో సెబీ తరఫున వాదిస్తున్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహెతా కోర్టుకు తెలిపారు.
కాగా, ఈ వ్యవహారంపై సుప్రీం కోర్టు ఓ నిపుణుల కమిటీని కూడా నియమించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఆ కమిటీ కోర్టుకు తమ నివేదికనూ సమర్పించిన సంగతి విదితమే. దీంతో సదరు కమిటీ తమ నివేదికలో సూచించిన సలహాలపై సెబీ తమ నిర్మాణాత్మక స్పందనను సోమవారమే తెలియజేసిందంటూ ఈ సందర్భంగా ధర్మాసనానికి మెహెతా వెల్లడించారు. ఈ నేపథ్యంలో మీకిచ్చిన గడువులోగా దర్యాప్తును పూర్తి చేయాలని మెహెతా ద్వారా సెబీకి మరోమారు కోర్టు గుర్తుచేసింది. అదానీ గ్రూప్‌పై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తును పూర్తి చేసేందుకు సెబీకి వచ్చే నెల 14దాకా గడువిస్తూ సుప్రీం కోర్టు ఈ ఏడాది మే 17న నిర్ణయించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

