Adani University | ప్రైవేట్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలన్న అదానీ గ్రూప్ ప్రణాళికకు గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రైవేట్ యూనివర్సిటీ ఏర్పాటుకు అనుమతించాలని గుజరాత్ సర్కార్కు అదానీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఏఐఈఆర్) దరఖాస్తు చేసింది. ఈ నేపథ్యంలో 2009 గుజరాత్ రాష్ట్ర ప్రైవేట్ యూనివర్సిటీల చట్టం ద్వారా యూనివర్సిటీ ఏర్పాటుకు రాష్ట్ర అసెంబ్లీ ఒక బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించింది.
రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆమోదం లభించడంతో అదానీ యూనివర్సిటీ 2022-23 విద్యా సంవత్సరం నుంచి అహ్మదాబాద్లో వివిధ కోర్సులను ప్రారంభించవచ్చు. పరిశ్రమ అవసరాలకు సరిపడా నిపుణులను తీర్చిదిద్దడంలో విద్యా వ్యవస్థలో గల లోపాలు ఉన్నాయని అదానీ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, అదానీ ఫౌండేషన్ అండ్ టస్ట్రీ చైర్పర్సన్ ప్రీతి జీ అదానీ పేర్కొన్నారు. ఆ లోపాలను సరిదిద్దేందుకు మార్గం సుగమం అయిందన్నారు.