ఈ వారం ఓ మోస్తరు అనుకూలంగా ఉంది. కుటుంబంలో గంభీరమైన వాతావరణం నెలకొంటుంది. ఆలోచనలు పరిపరివిధాలుగా సాగుతాయి. కొన్ని విషయాల్లో సంయమనం పాటించడం చాలా అవసరం. పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. సోదరులతో సఖ్యత నెలకొంటుంది. వారాంతానికి అన్నీ సర్దుకుంటాయి. తీర్థయాత్రలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. సమయపాలన పాటించడం అవసరం. శివారాధన శుభప్రదం.
ఆర్థికంగా లోటుపాట్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. మాటతీరు వల్ల కుటుంబంలో కలహ వాతావరణం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. సంయమనం పాటించడం చాలా అవసరం. సోదరుల వల్ల మేలు కలుగుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఉద్యోగులకు శ్రమ అధికం అవుతుంది. అందుకు తగ్గ ప్రతిఫలం కూడా దక్కుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. గణపతి ఆరాధన మేలు చేస్తుంది.
కుటుంబంలో సంతోషాలు నెలకొంటాయి. చాలా విషయాల్లో అగ్రెసివ్‌గా స్పందిస్తుంటారు. దీనివల్ల లాభనష్టాలు రెండూ కలుగుతాయి. సంయమనంతో వ్యవహరించాలి. పిల్లల విషయంలో సంతృప్తి పొందుతారు. ఉద్యోగులకు మంచి సమయం. అధికారుల మన్ననలు అందుకుంటారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. విద్యార్థులు మంచి విజయం సాధిస్తారు. ఆరోగ్యం ఉన్నతంగా ఉంటుంది. సుబ్రహ్మణ్యస్వామి ఆలయాన్ని సందర్శించండి.
గతవారంతో పోలిస్తే ఉన్నతంగా ఉంటుంది. వ్యక్తిగత ప్రతిష్ఠ పెరుగుతుంది. పలుకుబడితో పనులు నెరవేరుతాయి. ఆర్థిక విషయాల్లో ఒడుదొడుకులు ఉన్నాయి. ఆదాయం సమకూరుతుంది. అందుకు తగ్గ ఖర్చులూ ముందుకువస్తాయి. భూ లావాదేవీల్లో కొంత లాభం చేకూరుతుంది. పని భారం అధికమవుతుంది. సహోద్యోగులతో మనస్పర్ధలు తలెత్తవచ్చు. పిల్లల విషయంలో సంతృప్తికరమైన ఫలితాలు ఉన్నాయి. హనుమాన్ చాలీసా పఠించండి.
పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. అయితే, లేనిపోని భయాలు ఊహించుకొని మానసికంగా ఆందోళన చెందుతూ ఉంటారు. ఆర్థికంగా మంచి సమయం. ఉద్యోగులకు పదోన్నతి, అనుకూల స్థాన చలన సూచన. స్త్రీ మూలకంగా కలతలు రేగే అవకాశాలు ఉన్నాయి. అన్యమనస్కంగా ఏ పనినీ అంగీకరించొద్దు. సమయపాలన పాటించడం తప్పనిసరి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. వారాంతంలో ఒక శుభవార్త వింటారు. సూర్యారాధన శుభప్రదం.
మానసికంగా వింత ఆలోచనలు కలుగుతుంటాయి. ఏదో పొందాలనే ఆరాటం స్థిమితంగా ఉండనీయదు. రోజువారీ కార్యకలాపాలు నిర్విఘ్నంగానే సాగుతుంటాయి. కానీ, ప్రత్యేకంగా చేపట్టే పనులు మందకొడిగా సాగుతుంటాయి. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో విజయాలు సాధిస్తారు. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. ఉన్నతాధికారులు వివరణ కోరే పరిస్థితులు తలెత్తవచ్చు. వారాంతంలో పరిస్థితుల్లో కొంత మార్పు వస్తుంది. శివాలయాన్ని సందర్శించండి.
మనసు స్థిమితంగా ఉండదు. ఎవరు ఎలాంటి వారో బేరీజు వేసుకోవడంలోనే సమయం గడిచిపోతుంది. మీకంటూ ఓ లక్ష్యం లేకుండా పోతుంది. పట్టుదలతో ప్రయత్నిస్తే.. పరిస్థితుల్లో కొంత అనుకూలత ఏర్పడుతుంది. ఉద్యోగంలో ఏ ఇబ్బందీ ఉండదు. రోజువారీ జీవితంలోనే చికాకులు తలెత్తుతాయి. పిల్లల విషయంలో ఆందోళన ఏర్పడవచ్చు. వారితో మాటపట్టింపులు తలెత్తవచ్చు. ఓర్పుతో ఉండటం చాలా అవసరం. లక్ష్మీధ్యానం శుభప్రదం.
అనుకున్న పనులు ప్రణాళికా బద్ధంగా పూర్తి చేయగలుగుతారు. ఆకస్మిక ధన లాభం సూచితం. ఆరోగ్యం ఉన్నతంగా ఉంటుంది. మీ శక్తి సామర్థ్యాలను నిరూపించుకునే అవకాశాలు తారసపడతాయి. పిల్లల విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యంగా ఉంటారు. భూ లావాదేవీల్లో మంచి లాభాలు అందుకుంటారు. తీర్థయాత్రలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. వేంకటేశ్వరస్వామి ఆరాధన మేలు చేస్తుంది.
చాలా విషయాల్లో కంగారుగా ఉంటారు. మీ వైఖరి సొంతవారి మనసును కష్టపెడుతుంది. చిన్న చిన్న విషయాలకే ఎక్కువగా ఆవేశానికి గురవుతుంటారు. మంగళవారం నుంచి మానసికంగా ఆందోళనలు తీవ్రం అవుతాయి. పితృవర్గంతో కలహం ఏర్పడే సూచనలు ఉన్నాయి. ఏ పని మీదా మనసు లగ్నం కాదు. ఆరోగ్యం మందకొడిగా ఉంటుంది. సంయమనంతో వ్యవహరించడం మంచిది. సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన శుభప్రదం.
శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. గతంలో పెట్టిన పెట్టుబడులకు ప్రతిఫలాలు అందుతాయి. రావలసిన డబ్బు చేతికి ఆలస్యంగా అందుతుంది. ఆత్మీయులు అనుభవజ్ఞుల సహకారంతో పనులు పూర్తవుతాయి. కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటారు. కుటుంబసభ్యులతో సంతోషంగా కాలం గడుపుతారు. సాహిత్య సభలకు హాజరవుతారు. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.
ఉత్సాహంతో పనులు చేస్తారు. కుటుంబసభ్యులతో సంతోషంగా గడుపుతారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వాహన మరమ్మతులు ముందుకు వస్తాయి. దాయాదులతో మాటపట్టింపులు ఏర్పడవచ్చు. సంయమనంతో వ్యవహరించండి. ప్రయాణాలు వాయిదా పడతాయి. పనిభారం పెరగడంతో కొంత అలసటకు గురవుతారు. అధికారుల ఆదరణ పొందుతారు. నరసింహస్వామి ఆలయాన్ని సందర్శించండి.
ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. భూ వివాదాలు పరిష్కారం అవుతాయి. అనవసరమైన కాలయాపన, ఖర్చులు ఉండవచ్చు. ప్రారంభించిన పనులలో శ్రమ అధికంగా ఉంటుంది. ఇంటి వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉంటారు. సహోద్యోగులు, అధికారులతో అభిప్రాయ భేదాలు రావచ్చు. సంయమనంతో పనులు చేసుకోవడం అవసరం. ఇష్టదైవాన్ని ఆరాధించండి.