Adani – Ambani | చేతులు కలిపిన అదానీ.. అంబానీ.. మధ్యప్రదేశ్ అదానీ పవర్ కంపెనీలో రిలయన్స్ కు వాటాలు..!
Adani - Ambani | భారత కుబేరులు రిలయన్స్ చైర్మన్ ముకేశ్ అంబానీ, అదానీ గ్రూప్ అధినేత గౌతం అదానీ చేతులు కలిపారు. మధ్యప్రదేశ్ లోని అదానీ అనుబంధ పవర్ ప్రాజెక్టులో ముకేశ్ అంబానీ సారధ్యంలోని రిలయన్స్ 26 శాతం వాటా కొనుగోలు చేయడానికి రెండు సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది.
Adani – Ambani | భారత కుబేరులు రిలయన్స్ చైర్మన్ ముకేశ్ అంబానీ, అదానీ గ్రూప్ అధినేత గౌతం అదానీ చేతులు కలుపుతున్నారా? అంటే అవుననే సమాధానమే వస్తున్నది. మధ్యప్రదేశ్ లోని గౌతం అదానీ ఆధీనంలోని పవర్ ప్రాజెక్టులో రిలయన్స్ ఇండస్ట్రీస్ 26 శాతం వాటాను కొనుగోలు చేయనున్నది. ఈ ప్లాంట్ నుంచి ఉత్పత్తి చేసే 500 మెగావాట్ల విద్యుత్ ను క్యాప్టివ్ యూజ్ కింద వాడుకునేందుకు రిలయన్స్, అదానీ గ్రూప్ మధ్య సంతకాలు జరిగినట్లు తెలుస్తున్నది. అదానీ పవర్ అనుబంధ మహన్ ఎనర్జెన్ లిమిటెడ్ సంస్థలో రిలయన్స్ ఐదు కోట్ల ఈక్విటీ షేర్లకు కొనుగోలు చేస్తుంది. ఈ షేర్ ఒక్కో విలువ రూ.10. ఈ పవర్ ప్రాజెక్టు నుంచి 500 మెగావాట్ల విద్యుత్‌ను క్యాప్టివ్ యూజ్ కోసం వాడుకుంటామని రిలయన్స్, అదానీ సంస్థలు గురువారం స్టాక్ ఎక్స్చేంజీల్లో వేర్వేరుగా ఫైలింగ్ చేశాయి.
ముకేశ్ అంబానీ ఆధ్వర్యంలోని రిలయన్స్.. ఆయిల్ అండ్ గ్యాస్ నుంచి టెలికం రంగంపై ఫోకస్ చేస్తే విమానాశ్రయాల నుంచి నౌకాశ్రయాల మౌలిక వసతులు మొదలు, బొగ్గు మైనింగ్, క్లీన్ ఎనర్జీ రంగాలపై ఫోకస్ చేస్తున్నారు. ఇద్దరూ క్లీన్ ఎనర్జీ బిజినెస్ మీద బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టారు. 2030 నాటికి దేశంలోనే అతిపెద్ద సంప్రదాయేతర ఇంధన ఉత్పత్తి సంస్థగా ఎదగాలని అదానీ గ్రూప్ ప్రయత్నిస్తుండగా, గుజరాత్లో సోలార్ ప్యానెల్స్, బ్యాటరీలు, గ్రీన్ హైడ్రోజన్, ఫ్యూయల్ సెల్స్ నిర్మాణానికి నాలుగేసి గిగా ఫ్యాక్టరీలను రిలయన్స్ నిర్మిస్తున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

