KYC Norms in Banks | కొత్త సంవత్సరంలో బ్యాంకులు తమ ఖాతాదారులకు షాక్ ఇవ్వబోతున్నాయి. చాలా మంది బ్యాంకుల అభ్యర్థన మేరకు కూడా నో యువర్ కస్టమర్ (కేవైసీ) (Know Your Customer (KYC) పత్రాలను సమర్పించరు. అడ్రస్ మారినా.. ఫోన్ నంబర్ మారినా నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. వాటిని తమ బ్యాంకు శాఖలో ఇచ్చి అప్డేట్ చేయరు. దీనిపై ఆర్బీఐ తీవ్రంగా స్పందించింది. ఈ నెలాఖరు లోగా Know Your Customer (KYC) కేవైసీ నిబంధనలకు అనుగుణంగా పత్రాలు సమర్పించని వారి ఖాతాలను స్తంభింపజేయాలని బ్యాంకులను ఆదేశించింది.
వివిధ బ్యాంకుల వద్ద వందల మంది కస్టమర్ల కేవైసీ పత్రాల వ్యాలిడిటీ కాలం చెల్లిపోయి ఉంటుంది. అయితే కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో కేవైసీ పత్రాలను సమర్పించాలని ఖాతాదారులపై ఒత్తిడి తేవొద్దని బ్యాంకులను ఆర్బీఐ కోరింది. కేవైసీ నిబంధనల అప్డేట్ కేవలం బ్యాంకుల పని మాత్రమే కాదు.. ఏదేనీ సంస్థ హవాలా లావాదేవీలు నిర్వహించకుండా నిరోధించే ప్రక్రియే కేవైసీ అప్డేషన్. ఇది ఫైనాన్స్ కంపెనీలు, మ్యూచువల్ ఫండ్స్‌కు, బ్రోకింగ్ హౌసెస్‌కు, డిపాజిటర్లకూ వర్తిస్తుంది.
లో రిస్క్ ఖాతాలు ఉన్న కస్టమర్లు ప్రతి 10 ఏండ్లకోసారి కేవైసీ నిబంధనలను అప్డేట్ చేస్తారని బ్యాంకర్లు చెబుతుంటారు. హై రిస్క్ గల కస్టమర్లు ప్రతి రెండు సంవత్సరాల కోసారి అప్డేట్ చేయడం అవసరం. డార్మెట్ లేదా ఇన్ యాక్టివ్ ఖాతాలకు తాజాగా ఫ్రెష్ కేవైసీ అప్డేట్స్ సమర్పిస్తే గానీ ఆయా ఖాతాలను అన్ ఫ్రీజ్ చేయడం లేదా రీయాక్టివేట్ చేయడం గానీ చేయొచ్చు.