చికెన్ ప్రియులకు గుడ్‌న్యూస్ : ఏటా 50 పొపాయ్స్ స్టోర్స్ ఏర్పాటు
చికెన్ ప్రియులకు ప్రపంచంలో అతిపెద్ద చికెన్ క్విక్ సర్వీస్ రెస్టారెంట్స్ పొపాయ్స్ తీపికబురు అందించింది. భారత్‌లో పెద్దసంఖ్యలో ఫుడ్ స్టోర్స్‌ను విస్తరించనున్నట్టు పేర్కొంది.
న్యూఢిల్లీ : చికెన్ ప్రియులకు ప్రపంచంలో అతిపెద్ద చికెన్ క్విక్ సర్వీస్ రెస్టారెంట్స్ పొపాయ్స్ తీపికబురు అందించింది. భారత్‌లో పెద్దసంఖ్యలో ఫుడ్ స్టోర్స్‌ను విస్తరించనున్నట్టు పేర్కొంది. బెంగళూర్, చెన్నైల్లో రెస్టారెంట్ బ్రాండ్స్ ఇంటర్నేషనల్ ఇంక్‌కు చెందిన ఫ్రైడ్ చికెన్ బ్రాండ్ పొపాయ్స్ భారత్‌లో విస్తరణకు ప్రణాళికలు రూపొందించింది. భారత్‌లో ఏటా 50 పొపాయ్స్ స్టోర్స్ లాంఛ్ చేయాలని కంపెనీ భావిస్తోంది. భారత్ తమకు సానుకూల మార్కెట్ అని ఇక్కడ విస్తరణకు మంచి అవకాశాలున్నాయని రెస్టారెంట్స్ బ్రాండ్ ఇంటర్నేషనల్ సీఈఓ జోషు కొజా పేర్కొన్నారు.
బర్గర్ కింగ్, టిమ్ హార్టన్స్, పొపాయ్స్ వంటి బ్రాండ్స్‌తో కూడిన గ్లోబల్ క్విక్ సర్వీస్ రెస్టారెంట్ చైన్లను రెస్టారెంట్ బ్రాండ్స్ ఇంటర్నేషనల్ నిర్వహిస్తోంది. కంపెనీ ఇండియన్ ఫ్రాంచైజీ జుబిలంట్ ఫుడ్‌వర్క్స్ లిమిటెడ్ (జేఎఫ్ఎల్) రాబోయే నాలుగైదేండ్లలో 250 పొపాయ్స్ స్టోర్స్ ఏర్పాటు చేయాలని ప్రణాళికలు రూపొందించింది.
భారత్ తమకు మెరుగైన మార్కెట్లలో ఒకటని, అత్యధిక జనాభాతో పాటు యువ జనాభా అధికంగా కలిగిన భారత్‌లో పెరుగుతున్న ఆదాయాలతో వినియోగదారులు పెద్దసంఖ్యలో ఉన్నారని ఇది ఆకర్షణీయ మార్కెట్లలో ఒకటని కొజా చెప్పుకొచ్చారు. పొపాయ్స్ విస్తరణ ప్రణాళికలపై జుబిలంట్ ఫుడ్వర్స్క్ సీఈఓ సమీర్ ఖెటర్పాల్ వివరిస్తూ ఏటా 50 స్టోర్లతో రాబోయే నాలుగు నుంచి ఐదేండ్లలో 250 స్టోర్స్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. తమకు కేఎఫ్‌సీ నుంచి దీటైన పోటీ ఉన్నా ఫ్రైడ్ చికెన్ మార్కెట్ భారీగా ఉండటంతో అందరికీ అవకాశం ఉందని అన్నారు.
Read More :
హైదరాబాద్‌లో బ్లాక్‌బెర్రీ ఐవోటీ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఎంఎస్ఎన్ ‘ఫెసోబిగ్’
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

