Credit Suisse Bank | యూరప్‌కూ పాకిన బ్యాంకుల సంక్షోభం.. క్రెడిట్ స్విస్ బ్యాంకు పదేళ్ల లాభాలు ఆవిరి!
Credit Suisse Bank | అమెరికా బ్యాంక్‌ల్లో మొదలైన సంక్షోభం త్వరితంగా యూరప్‌కు వ్యాపించింది. సిట్జర్లాండ్ కేంద్రంగా బ్యాం కింగ్ కార్యకలాపాలు నిర్వహించే క్రెడిట్ స్వీస్ అల్లకల్లోలమైంది.
Credit Suisse Bank | లండన్, మార్చి 15: అమెరికా బ్యాంక్‌ల్లో మొదలైన సంక్షోభం త్వరితంగా యూరప్‌కు వ్యాపించింది. సిట్జర్లాండ్ కేంద్రంగా బ్యాం కింగ్ కార్యకలాపాలు నిర్వహించే క్రెడిట్ స్వీస్ అల్లకల్లోలమైంది. పదేండ్ల పాటు ఆర్జించిన లాభాలన్నీ ఒక్క ఏడాదిలోనే (2022) కోల్పోయామని, గత రెండేండ్ల తమ బ్యాలెన్స్ షీట్స్‌లో కొన్ని తప్పులు చోటుచేసుకున్నాయంటూ క్రెడిట్ స్వీస్ తాజాగా ప్రకటించడంతో ఆ షేరు బుధవారం స్విస్ స్టాక్ మార్కెట్లో 26 శాతంపైగా పతనమయ్యింది.
బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ తదితర యూరప్ దేశాల్లో బ్యాంక్ షేర్లు కుప్పకూలాయి. అమెరికాలో సైతం ఇదే ట్రెండ్ నెలకొంది. యూబీఎస్, బీఎన్పీ పారిబా, సొసైటె జనరెలె, కామర్జ్‌బ్యాంక్, డాయిష్ బ్యాంక్, జేపీ మోర్గాన్, సిటీబ్యాంక్, హెచ్ఎస్బీసీ, బ్యాంక్ ఆఫ్ అమెరికా తదితర పశ్చిమ దేశాల బ్యాంకింగ్ దిగ్గజాల షేర్లు నిలువునా పతనమయ్యాయి. యూఎస్‌కి చెందిన సిలికాన్ వ్యాలీ బ్యాంక్, సిగ్నేచర్ బ్యాంక్‌ల పతన ప్రభావం అంతటా వ్యాపిస్తున్నదని, యూరప్‌లోని క్రెడిట్ స్వీస్కి ఈ సెగ తొలుత తాకిందని విశ్లేషకులు చెప్పారు. ప్రపంచంలో 8వ పెద్ద ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అయిన క్రెడిట్ స్వీస్ వాణిజ్య బ్యాంకింగ్, అసెట్ మేనేజ్మెంట్ కార్యకలాపాలను సైతం నిర్వహిస్తున్నది.
120 బిలియన్ డాలర్ల నిధులు బైటకు
పలు వివాదాలు, కుంభకోణాలు, టాప్ హెడ్స్‌లో మార్పుల ఫలితంగా క్రెడిట్ స్వీస్ 2022 చివరి త్రైమాసికంలో ఈ బ్యాంక్ నుంచి భారీగా నిధులు బైటకు తరలివెళ్లాయి. గత ఏడాది అక్టోబర్-డిసెంబర్ మధ్యకాలంలో బ్యాంక్ నుంచి ఇన్వెస్టర్లు, ఖాతాదారులు 110 బిలియన్ల స్విస్ ఫ్రాంక్ల్ని (120 బిలియన్ డాలర్లు) వెనక్కు తీసుకున్నారు. 2021 చివరినాటికి క్రెడిట్ స్వీస్ ఆస్తులు 1.6 ట్రిలియన్ స్విస్ ఫ్రాంక్‌లు కాగా, 50,000 మంది ఉద్యోగులున్నారు. ఇది స్విట్జర్లాండ్‌లో వాణిజ్య బ్యాంకింగ్ కార్యకలాపాల్ని నిర్వహిస్తుండగా, ప్రపంచవ్యాప్తంగా వెల్త్ మేనేజ్మెంట్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, అసెట్ మేనేజ్మెంట్ సేవల్ని అందిస్తున్నది.
100 బిలియన్ డాలర్లు నేరగాళ్లవే
సిట్జర్లాండ్ బ్యాంక్లంటే నల్లధనాన్ని దాచుకోవడానికి ఉపయోగించుకునే బ్యాంక్లనేది తెలిసిందే. అటువంటి నల్లకుబేరులకు సైతం షాకినిస్తూ 2002 ఫిబ్రవరిలో గార్డియన్ పత్రిక ఒక వార్తను వెల్లడించింది. మనీ లాండరింగ్, మాదక ద్రవ్యాలు, అవినీతి, హింస, ఇతర తీవ్ర నేరాల ద్వారా లబ్దిపొందిన 30,0000 మందికి పైగా క్రెడిట్ స్వీస్ ఖాతాదారులు ఆ బ్యాంక్‌లో 100 బిలియన్ డాలర్లు దాచిపెట్టారని గార్డియన్ తెలిపింది. అప్పటికే పలు వివాదాలతో సతమతమవుతున్న క్రెడిట్ స్వీస్ ప్రతిష్ఠ ఈ వార్తతో పూర్తిగా దెబ్బతింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

