హైదరాబాద్‌లో బ్లాక్‌బెర్రీ ఐవోటీ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్
మొబైల్ ఫోన్లు, అనుబంధ సాంకేతిక సేవల గ్లోబల్ దిగ్గజం బ్లాక్‌బెర్రీ.. హైదరాబాద్‌లో తమ నూతన ‘ఐవోటీ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్, ఇంజినీరింగ్ అండ్ ఇన్నోవేషన్'ను ప్రారంభించింది. ఈ మేరకు బుధవారం బ్లాక్‌బెర్రీ ప్రకటించింది.
న్యూఢిల్లీ, మార్చి 15: మొబైల్ ఫోన్లు, అనుబంధ సాంకేతిక సేవల గ్లోబల్ దిగ్గజం బ్లాక్‌బెర్రీ.. హైదరాబాద్‌లో తమ నూతన ‘ఐవోటీ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్, ఇంజినీరింగ్ అండ్ ఇన్నోవేషన్’ను ప్రారంభించింది. ఈ మేరకు బుధవారం బ్లాక్‌బెర్రీ ప్రకటించింది. కెనడా తర్వాత రెండో అతిపెద్ద బ్లాక్‌బెర్రీ ఐవోటీ డివిజన్ ఇదేనన్న అంచనాలు వినిపిస్తున్నాయి. కాగా, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ) పరిశ్రమల్లో అడ్వాన్స్ ఇన్నోవేషన్, తదుపరి తరం సాఫ్ట్వేర్-డిఫైన్డ్ వెహికిల్స్ (ఎస్‌డీవీ) నిర్మాణానికి దేశంలోనే అత్యుత్తమ సాఫ్ట్వేర్ ఇంజినీర్లను ఉద్యోగాల్లోకి తీసుకోనున్నట్టు ఈ సందర్భంగా కంపెనీ తెలియజేసింది. సీనియర్ మేనేజ్మెంట్, టెక్నికల్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, ప్రోడక్ట్ ఇంజినీరింగ్, క్లౌడ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఇంటిగ్రేషన్, సర్వీస్ డెలివరీ తదితర విభాగాల్లో నియామకాలుండనున్నాయి.
ప్రతిభావంతులకు పెద్దపీట
ప్రతిభావంతులకు పెద్దపీట వేస్తామని బ్లాక్‌బెర్రీ ఐవోటీ విభాగం అధ్యక్షుడు మట్టియాస్ ఎరిక్సన్ ఈ సందర్భంగా అన్నారు. ఆటోమోటివ్, ఇతరత్రా ఎంబడెడ్ సాఫ్ట్వేర్ పరిశ్రమల సంక్లిష్ట సమస్యలకు పరిష్కారాన్ని చూపడానికి సమర్థులైన డెవలపర్లు, ఇంజినీర్లకు ఇదో సదవకాశమన్నారు. కాగా, ఇక్కడి ఉద్యోగులు తొలుత క్యూఎన్ఎక్స్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్లాట్‌ఫాం (ఎస్డీపీ)ను వినియోగిస్తారని చెప్పారు. ఇన్నోవేషన్, ఎంబడెడ్ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ డెవలప్మెంట్-ఇంజినీరింగ్ సేవలు సురక్షితంగా, మెరుగైన పనితీరు కనబర్చేందుకు కావాల్సిన హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్లను మూల్యంకనం చేస్తారన్నారు.
‘హైదరాబాద్‌లో బ్లాక్‌బెర్రీ ఐవోటీ గ్లోబల్ సాఫ్ట్వేర్ ఇన్నోవేషన్ నెట్వర్క్ విస్తరణ సంతోషంగా ఉన్నది. ఐవోటీ సాఫ్ట్వేర్ రంగంలో, ముఖ్యంగా ఆటోమోటివ్ రంగంలో ఓ ప్రధాన సంస్థగా మాకున్న పేరును నిలబెట్టుకుంటాం. కస్టమర్లు, భాగస్వాములకు మెరుగైన సేవలను అందిస్తూ వేగంగా వృద్ధి చెందుతాం. హైదరాబాద్ కేంద్రం.. దేశంలోని మా కస్టమర్లు, భాగస్వాములకు మరింత దగ్గరయ్యేందుకు దోహదం చేయగలదు. కో-డెవలప్, కో-ఇన్నోవేటివ్లకు బ్లాక్‌బెర్రీ ఐవోటీ దన్నుగా ఉంటుంది’
– మట్టియాస్ ఎరిక్సన్, బ్లాక్‌బెర్రీ ఐవోటీ విభాగం అధ్యక్షుడు
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

