న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13: అదానీ గ్రూపునకు ఇచ్చిన రుణాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. ఇప్పటికే బీమా దిగ్గజం ఎల్ఐసీతోపాటు ప్రధాన బ్యాంకులు వేల కోట్ల రూపాయలు రుణాలు ఇవ్వగా..తాజాగా ఈ జాబితాలోకి ఐదు ప్రభుత్వరంగ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలు చేరాయి. జనవరి 31, 2023 నాటికి ఈ ఐదు సంస్థలు మొత్తంగా రూ.347.64 కోట్లు లేదా మొత్తం అసెట్స్ అండర్ మేనేజ్మెంట్లో 0.14 శాతం రుణాలు ఇచ్చాయని పార్లమెంట్ వేదికగా కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. పార్లమెంట్ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భాగవత్ కరాడ్ లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. బీమా దిగ్గజం ఎల్ఐసీ గతేడాది చివరినాటికి రూ. 35, 917.31 కోట్లు ఈక్విటీ, రుణాల రూపంలో ఇచ్చింది. ఈ ఐదు సంస్థలతోపాటు ఎగ్జిమ్ బ్యాంక్, స్మాల్ ఇండస్ట్రిస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నేషనల్ హౌజింగ్ బ్యాంక్, నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ తమ పరిధి మేర ఇచ్చాయని పేర్కొన్నారు.
ఐదు జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలివే